ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు
Transgender Marriage | ప్రేమించుకోవడానికి కులం, మతం అవసరం లేదు. పెళ్లికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. చివరకు జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్‌ను
జమ్మికుంట/వీణవంక : ప్రేమించుకోవడానికి కులం, మతం అవసరం లేదు. పెళ్లికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. చివరకు జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్‌ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కడూంచి మంగమ్మ-గోపాల్‌కు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు సంపత్. ఇంట్లో నుంచి ఐదేండ్ల క్రితం వెళ్లిపోయిన సంపత్.. ట్రాన్స్‌జెండర్(దివ్య)గా మారాడు. కొద్ది రోజులు జగిత్యాలలో జీవనం కొనసాగించాడు. ఇదే సమయంలో జగిత్యాలకు చెందిన కారు డ్రైవర్ అర్షద్, దివ్య ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని పలుసార్లు ప్రపోజ్ చేశాడు.
ఇంతలో దివ్య జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి మారింది. విషయం తెలుసుకున్న అర్షద్ గురువారం జమ్మికుంటకు వచ్చాడు. దివ్యను పెళ్లికి ఒప్పించాడు. తన ప్రేయసి దివ్య కోసం అర్షద్ కాస్తా.. హర్షిత్‌గా పేరు మార్చుకున్నాడు. పంచభూతాల సాక్షిగా మూడుముళ్లు వేసి, ఏడు అడుగులతో ఏకమయ్యారు.
అనంతరం నూతన వధూవరులు శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం హర్షిత్-దివ్య మాట్లాడుతూ వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతంగా ముందుకు సాగుతామని, ఒకరికొకరం గౌరవించుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

