Medigadda barrage | మేడిగడ్డలో సీఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం.. పలు శాంపిల్స్ సేకరణ
Medigadda barrage | జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌లో(Medigadda) బుధవారం సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం( SSMR team) పర్యటించింది.
మహదేవపూర్, జూన్ 5: జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌లో(Medigadda) బుధవారం సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం( SSMR team) పర్యటించింది. సీఎస్ఎంఆర్ఎస్, సీడబ్యూపీఆర్సీ(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందాలతో బరాజ్ పనితీరు లోపాలపై అధ్యయం చేయడానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు బరాజ్‌లో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లను సీఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం పరిశీలించింది.
బరాజ్ అప్‌స్టీమ్, డౌన్ స్టీమ్ పరిస్థితిని వీక్షించారు. ఎన్డీఎస్ఎస్ సూచనల మేరకు బరాజ్ వద్ద జరుగుతున్న మరమ్మతు, గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు పలు రకాల పరీక్షల కోసం శాంపిల్స్‌ను(Samples collected) సేకరించారు. బరాజ్‌లో జరుగుతున్న పనుల గురించి భారీ నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ తిరుపతి రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

