జగిత్యాల: ఇదేంటి ఈ పిల్లలు ఏదో ఓడ ఎక్కుతున్నారు అనుకుంటున్నారా? లేదా అంతా క్షమశిక్షణగా లైనులో వెళ్తున్నారు కాదా.. ఏదైనా సైన్స్‌ఫేర్‌లో భాగంగా ఎగ్జిబిషన్‌కు వెళ్లారనుకుంటున్నారా? అదేమీ కాదు.. అది వాళ్ల బడి. అందులో ఉన్న ఓ తరగతి గది. మరి వాళ్ల బడిలోకి పడవ ఎలా వచ్చిందనుకుంటున్నారా.. అదంతా ఓ ఉపాధ్యాయుడి కృషి.!
బడి చిన్నదే అయినా కలర్ఫుల్గా ఉంది కదూ. రంగు రంగుల బొమ్మలతో పిల్లలను ఇట్టే ఆకర్షిస్తున్న ఈ ప్రాథమిక పాఠశాల (primary School) జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం కొండాపూర్‌లో ఉన్నది. ఆ బడిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నెల్లి ప్రవీణ్ తన సొంత ఖర్చులతో దానిని అలా తయారు చేయించారు. ప్రైవేటుకు దీటుగా గత ఐదేండ్ల నుంచి ఇంగ్లిష్ మిడియంలో విద్యాబోధన చేస్తున్నారు.