Coronavirus | ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు రోగులు మృతి.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
Coronavirus | తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్దరు రోగులు మృతి చెందారు. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు.
Coronavirus | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ అలజడి సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 116 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 69కి చేరాయి.
కాగా.. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కారణంగా ఇద్దరు రోగులు మృతి చెందారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో వ్యక్తి కూడా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాడు. అతను కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఆ ఇద్దరు రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఇద్దరు రోగులు కూడా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి సుపరిండెంట్ నాగేంద్ర పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో… దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు పీజీ డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- corona death
- Coronavirus
- covid
- JN.1
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

