కొల్లాపూర్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. పేద ముస్లిం మహిళకు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పించి ఆ కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు. ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కాపీని ఆమెకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు నజియా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత నెలలో మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన నజియా బేగం తన కుటుంబ పరిస్థితితో పాటు ఆర్థిక స్థితిగతులను కేటీఆర్‌కు వివరించింది. గొప్ప మనసున్న మంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి.. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నజియాకు మున్సిపల్ కార్యాలయంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా ఉద్యోగం కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డర్ కాపీని నజియాకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం అందించారు.
ఈ సందర్భంగా నజియా మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తన ఆర్థిక పరిస్థితి వివరించిన వెంటనే కేటీఆర్ స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఉద్యోగ కల్పనకు సహకరించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి నజియా కృతజ్ఞతలు తెలిపారు.