హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్ (టెక్నికల్) గా ఏ మాధవరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు గతంలో బీడీఎల్‌లో ఈడీగా పనిచేశారు. మాధవరావుకు ఇండియన్ నేవీలో మూడేండ్ల అనుభవం ఉన్నది. ఆయన సేవలను గుర్తించి డైరెక్టర్‌గా నియమించారు.