Screen Time | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రోజూ గంటల తరబడి మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్న పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించడం ఎలా? అనే అంశంపై తల్లిదండ్రులకు ఉచితంగా ఆన్లైన్ సెషన్ నిర్వహించనున్నట్టు వన్ లైఫ్ కౌన్సెలింగ్ సైకాలజిస్టు రెబెకా మారియా వెల్లడించారు.
ఆదివారం (28వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి ఈ సెషన్ కొనసాగుతుందని, ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు 8555940650 ఫోన్ నంబర్‌ను సంప్రదించి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు.