గంట వ్యవధిలోనే కరోనాతో భార్యాభర్తలు మృతి
కరోనాతో భార్యాభర్తలు మృతి | ఇద్దరు భార్యాభర్తలు కరోనాకు బలయ్యారు. గంట వ్యవధిలోనే కరోనాతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు

నిజామాబాద్ : కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోరలు చాచిన కరోనా రక్కసికి కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. ఈ మహమ్మారి విజృంభణతో జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు, విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఇద్దరు భార్యాభర్తలు కరోనాకు బలయ్యారు. గంట వ్యవధిలోనే కరోనాతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మూర్‌కు చెందిన ఎంఐఎం నేత గోరేమియా కరోనా బారిన పడటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గోరెమియాను అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తరలిస్తుండగా, ఆయన భార్య కూడా చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రోజుకు 400 పాజిటివ్ కేసులకు తగ్గకుండా నమోదు అవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

