అక్షయకు కేటీఆర్ అభయం

- వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి
- ట్వీట్‌ను చూసి చలించిపోయిన మంత్రి
- చికిత్సకు సహకారం అందిస్తానని భరోసా
రాయికోడ్, జూన్ 10: వింత వ్యాధితో బాధపడుతున్న నిరుపేద చిన్నారి చికిత్సకు సాయం చేయాలంటూ వచ్చిన ఓ ట్వీట్‌కు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘చిన్నారి ఫొటో చూస్తేనే ఎంతో బాధ కలుగుతున్నది. మరి అంత కష్టం ఆమె ఎలా భరిస్తున్నదో’ అం టూ చలించిపోయారు. చిన్నారికి ఆపరేషన్ చేయిస్తానని, వ్యాధి పూర్తిగా తగ్గేవరకు సహకారం అందిస్తానని గురువారం మా టిచ్చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన పీ అవినాష్, సుమలత దంపతుల రెండో సంతానం అక్షయ. 22 నెలల అక్షయ పుట్టినప్పటి నుంచే గొంతుపై వాపుతో బాధపడుతున్నది. ప్రైవేటు ఉద్యోగి అయిన అవినాష్.. అక్షయ వైద్యం కోసం ఇప్పటికే రూ.80 వేల వరకు ఖర్చుచేశాడు. ఆపరేషన్‌కు భారీగా డబ్బులు అవసరం అవుతాయని పలు దవాఖానల వైద్యులు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని అవినాష్ స్నేహితుడు ట్విట్టర్లో పోస్ట్‌చేసి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్చేశాడు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. పాపకు ఆపరేషన్ చేయిస్తానని, వ్యాధి పూర్తిగా తగ్గేవరకు పూర్తి సహకారం అందిస్తానని భరోసానిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Akshaya
- Minister KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

