చనిపోతానని తెలిసీ బిడ్డకు జన్మ
ప్రసవం చేస్తే చనిపోతానని తెలిసినా బిడ్డకు ప్రాణం పోయాలని వైద్యులను వేడుకున్నదో నిండు గర్భిణి. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకోవటంతో పాటు షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి వైద్యులు మొక్కవోని ధైర్యంతో ప్రసవం చేయటంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
- రెండు కిడ్నీలు పాడై ఇప్పటికే రెండు సార్లు అబార్షన్
- మూడోసారి ప్రత్యేక కేసుగా తీసుకున్న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ దవాఖాన వైద్యులు
- 21 సార్లు డయాలసిస్‌తో స్పెషల్ కేర్
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
- ప్రస్తుతం తల్లీబిడ్డ.. ఇద్దరూ క్షేమం
సుల్తాన్‌బజార్, జూన్ 3: ప్రసవం చేస్తే చనిపోతానని తెలిసినా బిడ్డకు ప్రాణం పోయాలని వైద్యులను వేడుకున్నదో నిండు గర్భిణి. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకోవటంతో పాటు షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి వైద్యులు మొక్కవోని ధైర్యంతో ప్రసవం చేయటంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే న్యూనల్లకుంట-తిలక్‌నగర్‌కు చెందిన సరిత (22), శ్రీకాంత్ భార్యాభర్తలు. సరితకు రెండు కిడ్నీలు చెడిపోయాయి. షుగర్, థైరాయిడ్తోనూ బాధపడుతున్నది. గతంలో గర్భం దాల్చగా రెండు సార్లు అబార్షన్ అయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో మరోసారి గర్భం దాల్చగా, కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు పరీక్షల కోసం వచ్చింది. వైద్యులు పరీక్షించగా రెండు కిడ్నీలు చెడిపోయాయని తేలింది.
అప్పటికి ఆమె 20 వారాల గర్భవతి. ప్రసవం జరిగితే చనిపోయే ప్రమాదం ఉన్నదని వైద్యులు తెలిపారు. దీంతో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, కడుపులో ఉన్న బిడ్డను మాత్రం బతికించాలని వేడుకొన్నది. వైద్యులు ఈ విషయాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మికి వివరించారు. ఆమె సరితను స్వయంగా పరీక్షించి, ప్రసవ ఇబ్బందులను వివరించారు. అయినా సరిత ససేమిరా అనటంతో.. ఈ కేసును వైద్యులు చాలెంజ్‌గా తీసుకొన్నారు.
కిడ్నీలు ఫెయిల్ కావటంతో ఉస్మానియ దవాఖాన నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహాయ్ నేతృత్వంలో 21 సార్లు డయాలసిస్ చేయించి, 34 వారాల తర్వాత శనివారం రాత్రి శస్త్రచికిత్స చేసి ప్రసవం చేశారు. సరిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప 1.6 కిలోల బరువు ఉన్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తెలిపారు. సరిత దంపతులు వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

