Adilabad | ఇచ్చోడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బజార్ హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య చక్రం 9వ తరగతి చదువుతున్నది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది.
ఇచ్చోడ: ఆదిలాబాద్ (Adilabad ) జిల్లా ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బజార్ హత్నూర్ మండలంలోని మోర్కండి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కూతురు లాలిత్య చక్రం 9వ తరగతి చదువుతున్నది. ఆదివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. ఉదయం విద్యార్థులంతా నిద్రలేచినప్పటికీ ఆమె.. మేల్కొనకపోవడంతో ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో విగతజీవిగా మారిన లాలిత్యను చూసిన ఉపాధ్యాయులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భీమేష్ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోథ్ దవాఖానకు తరలించారు.

కాగా, లాలిత్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. అయితే అనారోగ్యంపై పాఠశాల సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

