MLC Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా పోలింగ్
MLC Elections | తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఉమ్మడి

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అత్యల్పంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ నమోదు కాగా, 1324 మంది ఓటర్లకు గానూ 1320 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్(1018/1026), ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 97.01 శాతం(1233/ 1271), ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 96.09 శాతం(738/768), ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్(860/937) నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటలకు వరకు కొనసాగింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియను వెబ్‌క్యాస్టింగ్ చేశారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.
కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్ రమణ, భానుప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి.. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి బరిలో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా, టీఆర్ఎస్ నుంచి యాదవరెడ్డి, కాంగ్రెస్ తరపున తూర్పు నిర్మల, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు నగేశ్, లక్ష్మయ్య, కే వెంకటేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

