పెండింగ్ మ్యుటేషన్లు 99.65% పరిష్కారం

- వారంపది రోజుల్లోనే పూర్తవుతున్న ప్రక్రియ
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి పోర్టల్‌లో ‘అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యుటేషన్’ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1,27,177 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 1,26,673 దరఖాస్తులను.. అంటే 99.65 శాతం పరిష్కరించారు.
సగటున 9 నిమిషాల్లోనే..
రైతు తగిన ఆధారాలతో పెండింగ్ మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అది నేరుగా కలెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది. కలెక్టర్ వాటిని పరిశీలించి అనుమతిస్తారు లేదా తిరస్కరిస్తారు. అనుమతించిన దరఖాస్తులు తాసిల్దార్ లాగిన్‌కు వస్తున్నాయి. ఈ ప్రక్రియ గరిష్ఠంగా వారం పది రోజుల్లోనే పూర్తవుతున్నది. ఆ తర్వాత రైతు స్లాట్ బుక్ చేసుకొని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి కొత్త పాస్‌బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. తాసిల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ ప్రక్రియ సగటున 9 నిమిషాల్లోనే పూర్తవుతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

