6 నెలల్లో 4,838 కోట్ల ఆదాయం

- స్థిరంగా వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు
- కరోనా నుంచి వేగంగా కోలుకున్న వైనం
- తొలి అర్ధభాగంలో 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్-సెప్టెంబర్) మొత్తం 9.25 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.4,838 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 90 వేల నుంచి లక్ష వరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, 60-70 వేల వరకు వ్వయసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.800 కోట్ల ఉంచి రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుంటుంది. అయితే ఈ ఏడాది మే నెలలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, లాక్‌డౌన్‌తో రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం భారీ స్థాయిలో మూడో వంతుకు పడిపోయాయి. ఆ నెలలో కేవలం 43 వేల లావాదేవీలు నమోదవడంతో ప్రభుత్వానికి రూ. 234 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జూన్‌లో లాక్డౌన్ ఎత్తివేయడంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తారన్న వార్తల నేపథ్యంలో జూలైలో చాలామంది ముందస్తు రిజిస్ట్రేషన్లకు మొగ్గు చూపారు. దీంతో ఆ నెలలో రికార్డు లావాదేవీలు నమోదయ్యాయి.
సింగరేణిలో ట్రిపుల్ ధమాకా
- లాభాల్లో వాటా,దసరా అడ్వాన్స్,దీపావళి బోనస్
- ఒక్కో కార్మికుడికి సగటున 1.15 లక్షలు
- రేపు ఖాతాల్లో పండుగ అడ్వాన్స్ జమ
- నవంబర్ 1న దీపావళి బోనస్‌గా 72,500
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

