కిడ్నాప్‌లు కాదు.. ప్రేమ వివాహాలు!
గత ఏడాది నమోదైన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం ప్రేమ, పెండ్లి పేరుతో పారిపోయిన ఘటనలే ఉన్నాయి. 2023లో మొత్తం 1,362 కిడ్నాప్ కేసులు నమోదైన 80 శాతం ఈ తరహా జంపింగ్‌లే ఉండటం విశేషం.
- అపహరణ కేసుల్లో ఇవే అధికం
- రేప్ కేసుల్లో పెండ్లిపేర వంచించిన కేసులదే సింహభాగం
- చాలా కేసుల్లో తెలిసినవారు, సహచర ఉద్యోగులే నేరస్థులు
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): గత ఏడాది నమోదైన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం ప్రేమ, పెండ్లి పేరుతో పారిపోయిన ఘటనలే ఉన్నాయి. 2023లో మొత్తం 1,362 కిడ్నాప్ కేసులు నమోదైన 80 శాతం ఈ తరహా జంపింగ్‌లే ఉండటం విశేషం. ప్రేమ కోసం, పెండ్లి కోసం నచ్చిన అబ్బాయి/అమ్మాయితో వెళ్లినా బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసులుగా నమోదు చేసినట్టు పోలీసులు వార్షిక క్రైమ్ నివేదికలో వెల్లడించారు. కిడ్నాప్ కేసులను సవాల్‌గా తీసుకొని వారిని వెతికి పట్టుకుంటే ప్రియుడి కోసం, ప్రియురాలి కోసం వెళ్లిన 646 ఘటనలు ఎదురైనట్టు పోలీసులు తెలిపారు. వీటిల్లో పెండ్లయిన వారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. 329 మంది 18 ఏండ్లు వారు కిడ్నాప్‌కు గురైనట్టు పోలీసులు చెప్పారు. ఆర్థిక సంబంధమైన అంశాల్లో 111 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఆర్థిక సమస్యల్లో భాగంగానే 35 అక్రమ నిర్బంధ కేసులు, పాతకక్షల నేపథ్యంలో 26 కిడ్నాపులు నమోదయ్యాయి.
పెండ్లిపేరుతో నయవంచన..
2023లో నమోదైన లైంగికదాడి కేసుల్లో అత్యధిక కేసుల్లో పెండ్లి చేసుకుంటానని నమ్మించి వంచించిన వారే ఉన్నారు. మొత్తం 2,284 రేప్ కేసుల్లో 1,580 కేసులు పెండ్లి చేసుకుంటానని నమ్మించినవే. మరో దారుణమైన విషయం ఏంటం టే.. ఇంటి చుట్టుపక్కలవారు, సహచర ఉద్యోగులే 307 కేసుల్లో లైంగికదాడులకు పాల్పడటం. ఈ దారుణాలకుతోడు కుటుంబసభ్యుల చేతుల్లో లైంగికదాడికి గురైనవారు 147 మంది ఉన్నారు. తెలియని వ్యక్తులు ద్వారా జరిగిన లైంగికదాడులు ఆరు మాత్రమే. మొత్తంగా 2,284 కేసుల్లో ఆరు కేసులు మినహా.. 2,278 కేసుల్లో బాధితులకు చాలా దగ్గరివారు అంటే కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రేమికులు, తోటి ఉద్యోగులే ఉన్నారు. విచారణ చేపట్టిన 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవితఖైదు విధించారు. 2022లో మొత్తం 2,293 లైంగికదాడి కేసులు నమోదవగా.. 2023లో 2,284 కేసులు నమోదయ్యాయి. గతేడాది లైంగికదాడుల కేసుల శాతం 0.39 శాతం తగ్గింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

