దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ జూలో 8 సింహాలకు కరోనా పాజిటివ్
సింహాలకు కరోనా | దేశంలోనే తొలిసారిగా జంతువులు కరోనా బారిన పడ్డాయి. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోనే. నెహ్రూ జూలాజికల్

హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా జంతువులు కరోనా బారిన పడ్డాయి. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోనే. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎనిమిది ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సింహాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జూ అధికారులు స్పష్టం చేశారు. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. ఎనిమిది సింహాలకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు మంగళవారం మధ్యాహ్నం వచ్చినట్లు జూ అధికారులు పేర్కొన్నారు.
పార్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. దీంతో వాటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.
వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారిన పడ్డాయి. దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌తో పాటు పలు పార్క్‌లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సింహాలు మహమ్మారి బారినపడడం దేశంలోనే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
ఈటల అలా వ్యాఖ్యానించడం సరికాదు : వినోద్ కుమార్
ఈటల ఒక మేకవన్నె పులి : మంత్రి గంగుల
టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నానికి ఈటల ప్రయత్నం : మంత్రి కొప్పుల
హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

