బరాజ్ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
మహదేవపూర్, జూలై 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు సోమవారం 62,700 క్యూసెక్యుల ప్రవాహం వచ్చింది. దీంతో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ ప్రవాహం ఎత్తు రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉన్నదని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.