Calcium | 60 దాటితే ఎముకలు బలహీనం.. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో తగ్గుతున్న కాల్షియం
ప్రతి మనిషి వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గుతుంది.. ఫలితంగా ఎముకలు బలహీనపడటంతోపాటు పటుత్వం కోల్పోతాయని అంటున్నారు వైద్య నిపుణులు.
- కాల్షియం, బోన్ డెన్సిటీ, స్ట్రెంత్‌లో తగ్గుదల
- తుంటి బాల్, కప్ దెబ్బతింటే మార్పిడి మస్ట్
- ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ నగేశ్, రామ్‌నాథ్
Calcium | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 8 (నమస్తే తెలంగాణ): ప్రతి మనిషి వయసు పెరుగుతున్నా కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గుతుంది.. ఫలితంగా ఎముకలు బలహీనపడటంతోపాటు పటుత్వం కోల్పోతాయని అంటున్నారు వైద్య నిపుణులు. 60 ఏండ్ల వయసు దాటితో ఎముకలు బలహీనమవుతాయని వారు పేర్కొంటున్నారు. తుంటి నొప్పి, తుంటి విరగడం వంటి సమస్యలకు రోగి వయసు, సమస్యకు గల కారణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు.
సాధారణ తుంటి నొప్పి సమస్యను ‘హిప్ ప్రిజర్వేషన్’ చికిత్సతో నివారించవచ్చునని ఆర్థో వైద్య నిపుణులు తెలిపారు. సమస్యను సకాలంలో గుర్తించకపోతే వ్యాధి ముదిరి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సకు దారితీసే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా తుంటి నొప్పి సమస్యకు పెయిన్‌కిల్లర్ మందులు, ఫిజియోథెరపీ రెండో స్టేజీలో కోర్ డి-కంప్రెషర్ వంటి చికిత్సలు నిర్వహిస్తారు. అప్పటికీ సమస్య తీరకపోతే తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరపాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అయితే సాధారణ చికిత్సకు అడ్వాన్స్డ్ చికిత్సగా ‘హిప్ ప్రిజర్వేషన్’తో తుంటి సమస్యను పరిష్కరించవచ్చని వైద్యులు తేల్చి చెప్తున్నారు.
తుంటిని సంరక్షించడమే హిప్ ప్రిజర్వేషన్
తుంటి జాయింట్ అనేది బాల్, సాకెట్ రూపంలో ఉంటుంది. ఇది మనిషి కూర్చోవడం, నిలబడటం, పరుగెత్తడంపై కీలకపాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యమైన తుంటిని సంరక్షించుకోవాలంటే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి ‘హిప్ ప్రిజర్వేషన్’ చికిత్స చేయించుకోవడం ఉత్తమం. హిప్ ప్రిజర్వేషన్ అంటే సమస్యను గుర్తించి ఏ కారణం చేత నొప్పి వచ్చిందో తెలుసుకొని ఆ భాగంలో ఉన్న ఎముకను సరిచేసి తుంటిని సంరక్షించడం. ఈ చికిత్స వల్ల సమస్యను అక్కడికక్కడే నిలవరించి నయం చేయవచ్చు. ఇది అన్ని వయసుల వారిలో సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా 50 నుంచి 60 ఏండ్లు పైబడిన వారిలో తుంటి ఎముక ఫ్రాక్చర్‌కు గురైతే సరిచేయడం సాధ్యం కాదు. వారిలో హిప్ రీప్లేస్మెంట్ ఒక్కటే మార్గం.
– డాక్టర్ రామ్‌నాథ్, ఉస్మానియా దవాఖాన రిటైర్డ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి
బలహీనతతోనే ఎముకల్లో ఫ్రాక్చర్స్
వయసు పెరిగిన కొద్దీ శరీరంలో కాల్షియం తగ్గడం, బోన్ డెన్సిటీ, బోన్ స్టెంత్ వంటివి తగ్గుతాయి. అరవై ఏండ్లు దాటిన వారిలో సాధారణంగానే బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. వారిలో బోన్ క్వాలిటీ, అస్టిరోసిస్లో ఫ్రాక్చర్స్ సర్వసాధారణం. దీని వల్ల ఫ్రాక్చర్స్ ఏర్పడతాయి. 30 ఏండ్లలోపు వారికి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయినప్పుడు స్క్రూస్తో ఫిక్స్ చేయవచ్చు. కానీ 50 లేదా 60 ఏండ్ల వయసు దాటిన వారిలో ఆ అవకాశం ఉండదు. వారికి తుంటి మార్పిడి ఒక్కటే శరణ్యం. కప్పు బాగానే ఉండి, బాల్ మాత్రమే దెబ్బతింటే హెమీ ఆర్థోప్లాస్టీ చేస్తారు. అదే బాలు, కప్పు రెండూ దెబ్బతింటే, లేదా రెండింటిలోనూ అరుగుదల ఉన్నప్పుడు హిప్ రీప్లేస్మెంట్ తప్పనిసరి. పెద్ద వయసు వారిలో ఎముకలు బలహీనపడి ఫ్రాక్చర్ అయితే హిప్ ట్రాన్స్‌ప్లాంట్ చేసి, బాల్, కప్ రెండింటినీ మారుస్తారు. వాటి స్థానంలో ఇంప్లాంట్స్ వేస్తారు.
– డాక్టర్ నగేశ్, ఆర్థో విభాగాధిపతి, నిమ్స్ దవాఖాన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bone Density
- bones
- calcium
- Decline
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

