హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ కాన్సులెట్ జనరల్ 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ‘కాప్ -28 సమ్మిట్’ను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించింది. బొటానికల్ గార్డెన్లో లేని 52 కొత్త జాతుల మొక్కలను ‘కాప్-28 కార్నర్’ పేరుతో నాటా రు. ఈ సందర్భంగా యూఏఈ హైదరాబాద్ కాన్సుల్ జనరల్ ఆరిఫ్ అల్నుయిమి యూఏఈ జాతీయ వృక్షం జమ్మి చెట్టును నాటారు.
తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలిసి కాప్-28 కార్నర్‌ను నిర్వహించడం సంతోషంగా ఉన్నదని ఆరిఫ్ అల్నుయిమి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు టీఎస్ఎఫ్డీసీకి యూఏఈ కాన్సుల్ అన్ని వేళల సహకరిస్తుందని అన్నా రు. అనంతరం టీఎస్ఎఫ్డీసీ వీసీ, ఎండీ డాక్టర్ జీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బొటానికల్ గార్డెన్ లో ఏడాది కాలంలోనే 1500 రకాల జాతులను నాటినట్టు చెప్పారు.