కెనడాలో జాబ్ ఇప్పిస్తామని 51 లక్షలు దోచేశారు!

అన్నాచెల్లెలిని నిలువునా ముంచిన సైబర్ ముఠా
హైదరాబాద్ సిటీబ్యూరో, అగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘కెనడాలో మీకు ఉద్యోగం వచ్చింది. అపాయింట్మెంట్ లెటర్ కజకిస్థాన్, పాకిస్తాన్, కశ్మీర్, ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు కొరియర్లో వస్తున్న ది. ఢిల్లీలో కొరియర్ బాయ్‌కి రోడ్డు ప్రమాదం జరిగింది. అందుకే కొద్దిగా ఆలస్యమవుతున్నది. ముం దుగా డబ్బు పంపండి. మీ ఉద్యోగానికి గ్యారంటీ’.. ఇలాంటి మాటలను నమ్మిన అన్నాచెల్లెలు సైబర్ నే రగాళ్ల వలలో చిక్కి ఏకంగా రూ.51లక్షలు పోగొట్టుకొన్నారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడకు చెం దిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి విదేశాల్లో ఉద్యోగం కోసం లింక్డిన్తోపాటు మరికొన్ని ఆన్లైన్ పోర్టల్స్‌లో దరఖాస్తు చేశాడు. అతడి ప్రొఫైల్‌ను పరిశీలించిన ఓ సైబర్ నేరగాడు సదరు యువకుడికి ఫోన్‌చేసి కెనడాలో పెప్సికో సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి, బ్యాక్‌డోర్‌లో ఇప్పిస్తానని, కొంత ఫీజు చెల్లిస్తే సరిపోతుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి న యువకుడు తన చెల్లెలికి కూడా ఉద్యోగం కావాలని కోరాడు. ప్రాసెసింగ్, వీసా ఫీజులు ఇతర ఖర్చులకోసమంటూ అజ్ఞాత వ్యక్తి రెండునెలల వ్యవధిలో వారి నుంచి రూ.51 లక్షలు కొల్లగొట్టాడు. చివరకు ఉద్యోగం బ్యాక్‌డోర్ నుంచి కావటం వల్ల అపాయింట్మెంట్ లెటర్‌ను కొరియర్లో రోడ్డుమార్గంలో పంపుతున్నామని చెప్పాడు. కజకిస్థాన్, పాకిస్థాన్, కశ్మీర్, ఢిల్లీ మీదుగా కొరియర్ వస్తున్నది. అంతలో ఢిల్లీలో కొరియర్ బాయ్‌కి యాక్సిడెంట్ అయింది. మరో రూ.4 లక్షలు పంపండి అని కోరాడు. దాంతో అనుమానం వచ్చిన అన్నాచెల్లెళ్లు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, సోమవారం సైబర్ ముఠాలోని డేనియల్ అనే ఓ నైజీరియన్‌ను అరెస్టు చేశారు.
అసలు సూత్రధారి అమెరికాలో..
ఈ ముఠాలో ముగ్గురు ఉన్నట్టు తేలింది. సూత్రధారి అమెరికాలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అన్నాచెల్లెలి నుంచి దోచి న సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు పంపినట్టు గుర్తించారు. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంతో డబ్బు మొ త్తం మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. అ ప్పటికీ రాచకొండ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ వెం కటేశ్ బృందం దాదాపు రూ.8 లక్షల వరకు ఫ్రీజ్ చేసినట్టు సమాచారం. బాధితులు పోగొట్టుకొన్న సొమ్ము తమ బంధువులు, ఇతరుల నుంచి అప్పు తెచ్చి, ఓ ప్లాటును అమ్మి ఇచ్చినట్టు తెలసింది. తండ్రి చనిపోవడంతో ఆ కు టటుంబానికి ఈ ప్లాటే ఆధారంగా ఉండేది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cyber Crime
- jobs
- money theft
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

