వివాహిత కడుపులో 3 కిలోల వెంట్రుకలు.. 2 గంటల పాటు శస్త్ర చికిత్స
Sangareddy | ఓ వివాహిత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కడుపు నొప్పి తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు

సంగారెడ్డి : ఓ వివాహిత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కడుపు నొప్పి తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి, వెంట్రుకల తుట్టెను తొలగించారు.
వికారాబాద్ జిల్లా బూచన్‌పల్లి గ్రామానికి చెందిన అంతారం శ్రీలత(20).. గత ఒద్ది రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నప్పటికీ, కడుపునొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 17న సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శ్రీలతకు సిటీ స్కాన్ చేయగా, కడుపులో వెంట్రుకల తుట్టె ఉన్నట్టు గుర్తించారు. దీంతో జనరల్ సర్జన్ డాక్టర్ కే కిరణ్‌కుమార్ నేతృత్వంలోని 8 మంది వైద్యుల బృందం శుక్రవారం రెండు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి, వెంట్రుకల తుట్టెను తొలగించారు. ప్రస్తుతం శ్రీలత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీలతకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

