2,600 పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
పాస్పోర్ట్ ప్రత్యేక సేవల కోసం శనివారం నిర్వహించిన డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
- 5 పాస్పోర్ట్ సేవాకేంద్రాల్లో శనివారం డ్రైవ్ విజయవంతం
- హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ ప్రత్యేక సేవల కోసం శనివారం నిర్వహించిన డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తతాల్ క్యాటగిరీ కింద పాస్పోర్ట్ దరఖాస్తుల సమర్పణ కోసం సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని తగ్గించడంలో భాగంగా అందించిన ప్రత్యేక సేవల్లో 2,600 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్టు పేర్కొన్నారు. ఆర్పీవో పరిధిలోని బేగంపేట, టోలిచౌకి, అమీర్పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ సేవలు అందించామని తెలిపారు. 19 నుంచి 23 వరకు ప్రతిరోజు తతాల్ అపాయింట్మెంట్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మొత్తం 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అదనంగా 50 తతాల్ అపాయింట్మెంట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ నెల 24 (శనివారం)న దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని చెప్పారు. దరఖాస్తుదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

