జేఈఈ మెయిన్-2‘కీ’లో 23 మార్పులు
- ఫలితాలపై తీవ్ర ప్రభావం
- నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ మొదలు కీ, ఫలితాల విడుదల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వరుసగా విఫలమవుతున్నది. ఎన్టీఏ తీరుతో ఫలితాలపై ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ ఫైనల్ కీని 23 మార్పులతో ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది. ప్రాథమిక కీని విడుదల చేసిన ఎన్టీఏ.. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23 మార్పులు చేస్తూ తుది కీని ప్రకటించింది. రెండో సెషన్లో ఆరు ప్రశ్నల ఆన్సర్లు తప్పుగా ఉండటంతో సమాధానాలను ఉపసంహరించింది. పరీక్షలు నిర్వహించిన జూలై 25 నుంచి 30 వరకు అన్ని సెషన్లల్లోనూ తప్పులు చోటుచేసుకోవడం ఎన్టీఏ వైఫల్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ప్రాథమిక కీని రూపొందించడంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఏ చేసిన మార్పులివే..
- జూలై 25న మొదటి షిప్ట్‌లో గణితంలో రెండు ప్రశ్నలకు కీలో ఇచ్చిన సమాధానాలను ఉపసంహరించారు. కెమిస్ట్రీలో రెండు ప్రశ్నల సమాధానాలు మార్చారు.
- జూలై 26న నిర్వహించిన మొదటి షిప్ట్ కెమిస్ట్రీలో ఒక ప్రశ్న, రెండో షిప్ట్‌లో గణితంలో మూడు ప్రశ్నల సమాధానాలను మార్చి ఒక ప్రశ్న సమాధానాన్ని ఉపసంహరించారు.
- జూలై 27న మొదటి షిప్ట్‌లో గణితంలో ఒక సమాధానాన్ని ఉపసంహరించగా, ఫిజిక్స్‌లో ఒక సమాధానాన్ని మార్చారు. రెండో షిప్ట్‌లో ఫిజిక్స్, గణితంలో రెండు సమాధానాలను ఉపసంహరించి, మూడు ప్రశ్నల ఆన్సర్లు మార్చారు.
- జూలై 28న రెండోషిప్ట్లో గణితం, కెమిస్ట్రీల్లో రెండింటి ఆన్సర్లు మార్చగా, 29న మొదటి షిప్ట్ ఫిజిక్స్‌లో ఒక ప్రశ్న, జూలై 30న రెండో షిప్ట్ కెమిస్ట్రీలో ఒక ప్రశ్న ఆన్సర్‌ను మార్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

