హైదరాబాద్, జనవరి9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల నిర్వహణకు సోమవారం రూ.12.50 కోట్ల నిధులను విడుదల చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ స్టడీ సర్కిళ్ల నిర్వహణకు ఈ ఏడాది బడ్జెట్లో 25 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బడ్జెట్లో భాగంగా ఇప్పటికే 10.40 కోట్లను విడుదల చేసింది. కాగా, బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు 88.85లక్షలను ప్రభుత్వం రిలీజ్ చేసింది.