Warangal | వరంగల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
Warangal | వరంగల్ : వరంగల్లోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో యథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆస్పత్రులపై పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి 18 సెల్ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేశామని సీపీ పేర్కొన్నారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున దందా జరగుతోందన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వైద్యులు, సిబ్బంది అందరినీ పట్టుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. మరికొద్ది
మంది నిందితులు పరారీలో వున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

