మహిళా సంఘాలకు17వేల కోట్ల రుణాలు

- 2021-22లో ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.17వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో సెర్ప్ ద్వారా రూ.12వేల కోట్లు, స్త్రీనిధి నుంచి రూ.3వేల కోట్ల వరకు, మెప్మా ద్వారా రూ.2వేల కోట్ల రుణాలను అందించనున్నారు. గత సంవత్సరం రూ.14వేల కోట్ల రుణాలను అందించారు. తాజాగా ఇచ్చే రుణాల ద్వారా దాదాపు 40లక్షలకు పైగా మహిళలు లబ్ధిపొందనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 65లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారి అవసరాల ఆధారంగా ఒక్కో సంఘానికి రూ.7.50లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాల రికవరీ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 98శాతం ఉన్నది. దీంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలు మాత్రమే వడ్డీ లేని రుణాలకు అర్హులు. ఈ ఏడాది నుంచి రుణం మొత్తాన్ని పెంచే విధంగా సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్హత ఉన్న సంఘాలకు రూ.10లక్షల వరకు రుణం అందించే విధంగా బ్యాంకర్లను ఒప్పించాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- TRS Party
- women groups
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

