శుభవార్త.. పేదలకు ప్రతి ఒక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం
ఉచిత బియ్యం | కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉదార స్వభావం చాటుకున్నది. మహమ్మారి విజృంభణతో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో

హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉదార స్వభావం చాటుకున్నది. మహమ్మారి విజృంభణతో ఉపాధి కోల్పోయి అర్ధాకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు జూన్ నెలకు 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు.
జూన్ నెల రేషన్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53లక్షల 56వేల కార్డులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా పదిహేను కిలోలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీలకు అదనంగా మరో పది కిలోల్ని, అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోలకు అదనంగా మరో పదికిలోల్ని అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79లక్షల 24వేల 300 మందికి లబ్ది చేకూరనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

