రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ
IAS officer | రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్‌ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
హైదరాబాద్ : రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్‌ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించింది. అశ్విని తానాజీ వాంఖడేను వరంగల్ అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ నియమించి, ఇక్కడ పని చేస్తున్న బీ హరి సింగ్‌ను బదిలీ చేసింది. బీ రాహుల్‌ను మంచిర్యాల అడిషనల్ కలెక్టర్‌గా నియమించింది. మయాంకర్ మిట్టల్‌ను నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా నియమించగా.. ఇక్కడ పని చేస్తున్న కందూరి చంద్రారెడ్డిని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
మంద మకరందును జగిత్యాలకు, బదిలీ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న జడల అన్సారీని అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని చెప్పింది. ప్రఫుల్ దేశాయ్‌ని జనగామకు బదిలీ చేయగా.. అబ్దుల్ హమీద్‌ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అభిషేక్ అగస్త్యను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న జాన్ శ్యామ్‌సన్‌ను అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని చెప్పింది. కుష్బూ గుప్తాను నల్గొండకు ట్రాన్స్ఫర్ చేయగా.. ఇక్కడ పని చేస్తున్న రాహుల్ శర్మను వికారాబాద్ అడిషన్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

