ముగిసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్.. 1,11,209 మంది క్వాలిఫై
TSLPRB | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నియామక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు గతేడాది డిసెంబర్ 8న ప్రారంభమైన ఫిజికల్ ఈవెంట్స్ నేటితో ముగిశాయి. అయితే ఈవెంట్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజరు కాగా, 1,11,209 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జరిగిన రిక్రూట్మెంట్తో పోల్చితే, ఇప్పుడు అదనంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
ఇక మార్చి 12 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్లోడ్ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

