స్టైపెండ్ చెల్లింపులో అసమానతలెందుకు?
రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఇంటర్న్‌లుగా పనిచేస్తున్న దాదాపు 1,100 మంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ)లు స్టైపెండ్ చెల్లింపుల్లో అసమానతలను నిరసిస్తూ సోమవారం విధులు బహిష్కరించారు. వీరిలో 700 మంది ప్రభుత్వ దవాఖానల్లో, మరో 400 మంది ప్రైవేట్ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్నారు.
- విధులు బహిష్కరించిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు
- ఐఎంజీలకు ప్రతి నెలా రూ.29,792 చెల్లింపు
- ఎఫ్ఎంజీలకు చెల్లిస్తున్నది రూ.5 వేలు మాత్రమే
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఇంటర్న్‌లుగా పనిచేస్తున్న దాదాపు 1,100 మంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ)లు స్టైపెండ్ చెల్లింపుల్లో అసమానతలను నిరసిస్తూ సోమవారం విధులు బహిష్కరించారు. వీరిలో 700 మంది ప్రభుత్వ దవాఖానల్లో, మరో 400 మంది ప్రైవేట్ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్న్‌లుగా పనిచేస్తున్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఐఎంజీ)లకు ప్రతినెలా రూ.29,79 2స్టైపెండ్ చెల్లిస్తున్నారని, తమకు మాత్రం కేవలం రూ.5 వేలే ఇస్తున్నారని, దీంతో రోజువారీ భోజన, రవాణా ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐఎంజీ ఇంటర్న్లతో సమానంగా ఎఫ్ఎంజీలకు స్టైపెండ్ ఇవ్వాలని ఎన్ఎంసీ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, వైద్యశాఖ ఉన్నతాధికారులు చాలా కాలం నుంచి తమ సమస్యను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధులు బహిష్కరించామని, మంగళవారం డీఎంఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగబోతున్నామని తెలిపారు. ఎఫ్‌ఎంజీల పోరాటానికి వైద్య సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

