ప్రభుత్వమిచ్చే 10వేల పింఛనే ఆసరా

భీమ్లానాయక్ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం
పవన్‌ను కలువాలనుకుంటున్నా
కిన్నెరమెట్ల కళాకారుడు మొగులయ్య
అచ్చంపేట, సెప్టెంబర్ 3 : తెలంగాణలోనే తనకు గుర్తింపు వచ్చిందని, ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల పింఛనే ఆసరాగా బతుకుతున్నానని 12 మెట్ల కిన్నెర ప్రముఖ వాయిద్య కళాకారుడు దర్శన మొగులయ్య తెలిపారు. సినీ నటుడు పవన్‌కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో పాటపాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు కిన్నెరను తీసుకొని సంతలో పాటలు పాడుకుంటూ బతికేవాడినని గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అంతరించిపోతున్న కళలు, కళాకారులను గుర్తింపు దక్కిందని తెలిపారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారం ఇచ్చి సత్కరించడంతోపాటు 8వ తరగతి సాంఘికశాస్త్రం పుస్తకంలో తనకళ, ఫొటోను ముద్రించి గౌరవించాడని సంబురంగా చెప్పారు. అవకాశం వస్తే హీరో పవన్ కల్యాణ్‌ను కలుసుకోవాలని అనుకుంటున్నట్టు మొగులయ్య తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

