ఆయిల్‌ఫెడ్ భూమి సేఫ్.. జీవో రద్దుకు శ్రీధర్‌బాబు ఆదేశం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రలకు బ్రేక్‌పడింది. ఆ భూమిని ప్రైవేట్‌కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేట్‌కు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.
- ఆర్టీసీ క్రాస్‌రోడ్డు స్థలం ప్రైవేట్‌కు కట్టబెట్టడంపై ‘నమస్తే’లో కథనం
- డబ్బులిస్తే ఆయిల్‌ఫెడ్‌కే అన్న మంత్రి
- డబ్చులిచ్చేందుకు సిద్ధమేనన్న ఎండీ
హైదరాబాద్, 22(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రలకు బ్రేక్‌పడింది. ఆ భూమిని ప్రైవేట్‌కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేట్‌కు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఆజామాబాద్ ఇండస్ట్రీ ఏరియాలో ప్లాట్ నం.1లో సుమారు 4 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుంది. దానిని 1960లో దయారాం సూరజ్ లోహిత ఆయిల్మిల్స్కు నాటి ప్రభుత్వం లీజుకిచ్చింది. సదరు కంపెనీ లీజు నిబంధనలు అతిక్రమించడంతో ఆ లీజును రద్దు చేసి ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించింది. అయినా సదరు కంపెనీ పైరవీలు, లాబీయింగ్‌తో తాజాగా ఆ భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదిపింది. ఇందులో భాగంగానే మొత్తం 17,261 గజాల్లో 15,445 గజాల భూమిని ప్రైవేట్ సంస్థకు, కేవలం 1,816 గజాలను ఆయిల్‌ఫెడ్‌కు కేటాయిస్తూ 2026 మే 22వ తేదీన ప్రభుత్వం జీవో నం.85 జారీ చేసింది. తద్వారా అసలు ఎక్కడ కూడా పొజిషన్లో లేని ప్రైవేట్ సంస్థకు ఏకపక్షంగా 3.5 ఎకరాల భూమిని కట్టబెడుతూ ప్రభుత్వరంగ సంస్థకు ఆన్యాయం చేసే పరిస్థితి ఏర్పడింది.
చర్చకు దారితీసిన ‘నమస్తే’ కథనం
విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రపై ఆగస్టు 11న ‘500 కోట్ల భూమి హాంఫట్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన ఆయిల్‌ఫెడ్ అధికారులు ఆ భూమి తమదేనని, తమకే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ వెంటనే ఫైలు కదలికి ఆగింది. ఇప్పుడు తాజాగా దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి ప్రైవేట్‌కు కేటాయిస్తూ ఇచ్చిన జీవో నం. 85ను రద్దు చేయాలని ఆదేశించారు. దీనిపై ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన గత చరిత్ర పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్నారని, అసలు విషయం తెలుసుకున్న తర్వాత నిర్ణయాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ఒకవేళ ఆయిల్‌ఫెడ్ నిబంధనల ప్రకారం ఆ భూమికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తే ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడుతానని, అధికారులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. అయితే దీనిపై గతంలోనే ఆయిల్‌ఫెడ్ ఎండీ స్పందిస్తూ.. ప్రైవేట్ వ్యక్తుల మాదిరిగానే తాము కూడా నిబంధనల మేరకు నిధులు చెల్లించేందుకు సిద్ధమేనని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

