గూడ్స్ ఆక్సిజన్ ట్యాంకర్లలో మంటలు

పెద్దపల్లి రూరల్, మే 29: గూడ్స్ రైలులోని ఆక్సిజన్ ట్యాంకర్లో మంటలు చెలరేగిన ఘటన పెద్దపల్లి జిల్లా చీకురాయి సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఆక్సిజన్ నింపుకొని వచ్చేందుకు ఖాళీ ట్యాంకర్లతో శనివారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి గూడ్స్ బయలుదేరింది. పెద్దపల్లి మండలం చీకురాయి సమీపంలోని 38వ రైల్వే గేటు వద్దకు రాగానే భారీ శబ్దంతో బోగీల్లోని ఓ ట్యాంకర్ నుంచి మంటలు వచ్చాయి. గూడ్స్ చివరలో ఉన్న గార్డు సురేశ్ గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. రైలును నిలిపి బోగీల నుంచి ఇంజిన్‌ను వేరు చేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు, ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

