తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారని తెలిసిందే. ట్వీట్ల ద్వారా తమ సమస్యలు చెప్పుకునే వాళ్లకు వెంటనే పరిష్కారం చూపించి.. వాళ్లను ఆదుకొని మంత్రి కేటీఆర్ గొప్ప మనసును చాటుతూ ఉంటారు. అప్పుడప్పుడు కేటీఆర్.. తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ట్విట్టర్లో షేర్ చేస్తుంటారు.
తాజాగా.. 2001 సంవత్సరానికి చెందిన తన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. త్రోబ్యాక్ 2001 పేరుతో లండన్‌లో దిగిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. వాండర్లస్ట్ అంటూ మరో హ్యాష్‌టాగ్‌ను కూడా జతచేసి రెండు ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో మంత్రి కేటీఆర్ చాలా యంగ్‌గా కనిపించారు. ఫోటోలో కేటీఆర్ ఫ్రెండ్ కూడా ఉన్నారు.
ఈ ఫోటోలపై స్పందించిన నెటిజన్లు.. సూపర్ సార్.. చాలా హాండ్సమ్గా ఉన్నారు. వండర్ఫుల్ మెమోరీస్..అంటూ కామెంట్లు చేస్తున్నారు.