వాకరూ వినూత్న ప్రచార కార్యక్రమం
హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ ఫ్యాషన్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘వాకరూ’ సరికొత్త మార్కెటింగ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘వాక్ మోర్, రెస్ట్‌లెస్’ నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా తన బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌తో రూపొందించిన 6 ప్రచార చిత్రాలను మంగళవారం నుంచి విడుదల చేయనున్నది. ఈ యాడ్ సిరీస్‌లో అమీర్‌ఖాన్ ఆరు విభిన్న రూపాల్లో కనిపిస్తారు.