Minister Jagdish Reddy | నాగరం ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి దిగ్బ్రాంతి
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
సూర్యాపేట : జిల్లాలోని నాగరంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటన పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ తో కలసి హుటాహుటినా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల పార్థివ దేహాల వద్ద నివాళులు అర్పించారు.
వర్షాల (Rains)కారణంగా గోడ కూలి (Wall Colapse) మృతి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున నష్ట పరిహారం (Compensation )ప్రకటించారు. అంతే గాకుండా తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 25 వేలు చొప్పున మంత్రి స్వయంగా అంద జేశారు.
వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యావకాశం కల్పించడంతో పాటు వారికి పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

