ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టం. అందుకు, అందం, ప్రతిభతోపాటుఅదృష్టమూ కలిసి రావాలి. తనకు ఇవన్నీ కలిసొచ్చాయని చెబుతున్నది సీనియర్ కథానాయిక త్రిష. అందుకే కాబోలు 43 ఏండ్ల వయసులోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉందామె. తమిళనాట విజయ్ విజయంతో మరోసారి వార్తల్లోకెక్కిన త్రిష కార్వాన్ కబుర్లు ఇవి..
విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక, త్రిషకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని సినీ జనాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. త్రిషకు డిమాండ్ తగ్గలేదు కాబట్టే తన చేతిలో ఉన్న ఆఫర్లు రుజువు చేస్తున్నాయని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రతిభకు ఎప్పటికీ అవకాశాలు ఉంటాయి. వెనుకెవరో ఉండి ఆఫర్లు ఇప్పిస్తే.. కెమెరా ముందు నటించేదెవరని త్రిష సపోర్టర్స్ అడిగే ప్రశ్న!
త్రిషకు విజయ్ మంచి స్నేహితుడు! తనతో గిల్లి, తిరుపాచి, ఆది, కురువి, లియో సినిమాలు చేసింది. ఎంతోమంది హీరోలతో ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. కానీ, వారందరి కంటే త్రిషకు విజయ్ ప్రత్యేకం. అది సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అని త్రిష చెప్పకనే పలు సందర్భాల్లో చెబుతూనే వస్తోంది.
‘నేను ఎప్పటికైనా సీఎం అవుతా’నని ఆమె క్యాజువల్‌గానే అన్నది. రాజకీయాలు తన లక్ష్యమని ఆ తర్వాత ఎప్పుడూ అనలేదు. కాలం మారినట్టే తమిళ రాజకీయం మారింది. విజయ్‌తో స్నేహం త్రిషను రాజకీయాల్లోకి లాగేస్తోంది. ‘ఏమో గుర్రమెగరా వచ్చు.. త్రిష స్వారీ చేయవచ్చు’ అంటూ.. విజయ్ రాజీనామా చేసిన స్థానం నుంచి త్రిష పోటీ చేయొచ్చనే వాళ్లు అంటున్నారు.
విజయ్ రాజకీయ ప్రభావం వల్లే తన రెమ్యునరేషన్ పెంచిందనే వాళ్లూ ఉన్నారు. అయితే డిమాండ్ ఉన్నప్పుడు ఎవరైనా రెమ్యునరేషన్ పెంచుతారు. లైమ్ లైట్లో లేనప్పుడైతే.. రెమ్యునరేషన్ లేకపోయినా, చిన్న అవకాశం దక్కినా చాలని సంతృప్తి పడతారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి తను వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం రాలేదు. ఇప్పుడవి ఇంకాస్త పెరిగాయి. అవకాశాన్ని వాడుకోవడం తప్పు కాదు కదా! కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దు.
ప్రేమ ఎప్పడూ గొప్పదేనని త్రిష అన్నప్పుడు అందరూ ఇది అదే.. అది ఇదే.. నంటూ విజయ్‌తో స్నేహం గురించి, విజయ్ మొదటి భార్యతోవిడాకుల గురించి లింకులు పెట్టి చర్చ పెట్టారు. కానీ, ఆ పోస్టులో తన ైస్టెలిష్ బృందానికి త్రిష కృతజ్ఞతలు చెప్పారనే మరో విషయం మరిచిపోతున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిన నెహ్రూ స్టేడియంలో ఆమె చాలా హుందాగా కనిపించారు. తన కొప్పు, మల్లెపూలు, చీర రంగు చూసిన తమిళ జనం మాజీ సీఎం జయలలితను గుర్తు చేసుకున్నారు. మీడియా కూడా ఆమె ఆహార్యాన్ని ఆకాశానికెత్తింది.
రజినీకాంత్, కమల్‌హాసన్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు పది కోట్లు డిమాండ్ చేసిందని సినీ ఇండస్ట్రీలో హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. ‘ఒక లేడీ స్టార్‌కి అంత డిమాండా?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు లేరు. కానీ, త్రిషకు డిమాండ్ తగ్గలేదని మాత్రం అనుకోలేకపోతున్నారు. ఇక్కడ రెమ్యునరేషన్ విషయం కాదు. రజనీ, కమల్ లాంటి దగ్గజాలతో కలిసి నటించమనే ఆఫర్లు వస్తున్నాయంటేనే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి. రెమ్యునరేషన్ గురించి మాట్లాడేవాళ్లు ఈ విషయాన్ని గుర్తించడం లేదు.