మువ్వల్లే గాజులు ఘల్లుమన్నయే..
గాజులు ఘల్లుమనడం సహజమే. కానీ ఇప్పుడు మువ్వలూ వాటికి తోడవుతున్నాయి. ఆ శ్రుతిలో జత కలుపుతున్నాయి. చిరు మువ్వలు పొదిగిన మట్టిగాజులు కొంగొత్త హంగులతో అతివల్ని ఆకట్టుకుంటున్నాయి. విభిన్న మాడళ్లలోనూ మెరుస్తున్న ‘ఘుంఘ్రూ బ్యాంగిల్స్' పండుగ వేళ కొత్త ఫ్యాషన్.
చేతికి గాజులు తొడగకుండా అలంకరణ పూర్తవదు ఆడపిల్లకి. ముఖ్యంగా బతుకమ్మ పండుగంటే కాలూ చేయీ కలిపి ఆడి పాడతాయి. వాటికి దరువు వేసేది గాజులూ, మువ్వలే మరి! అలాంటి వేడుకకి శోభ తెచ్చేలా మువ్వల గాజులు మార్కెట్లో దొరుకుతున్నాయి. మనం వేసుకున్న దుస్తులకు తగ్గట్టు ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎన్నో వెరైటీల్లో ఇవి తయారవుతున్నాయి.
తీరొక్క రకం
బతుకమ్మను పేర్చితే తీరొక్క పువ్వులుంటాయి. నూటొక్క వన్నెలుంటాయి. దేనికదే అందం. వేటికవే ప్రత్యేకం. వేడుకల వేళ అతివల ముందుకొచ్చిన మువ్వల గాజులదీ అదే రీతి. రకరకాల వన్నెలూ, తీరొక్క రకాల డిజైన్లూ వీటి సొంతం. మామూలుగా
మనం వేసుకునే సాదా కటింగ్ మట్టి గాజుల మీద సన్నటి బంగారు రంగు మువ్వలు పొదిగి వచ్చేవి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. పెద్దవాళ్లు కూడా వేసుకోగలిగేలా ఉన్న వీటిని ఎరుపు, పసుపు, నారింజ, నీలం, ఆకుపచ్చ… ఇలా
అన్ని రంగుల్లోనూ రూపొందిస్తున్నారు. సైడ్ గాజుల కింద ధరించేలా కాస్త వెడల్పుగా వచ్చే గాజులకూ మువ్వలు జతవుతున్నాయి. లేదూ ఒక్కటే పెద్దది కావాలన్నా ప్లాస్టిక్, మెటల్తో చేసిన విభిన్నమైన మాడల్స్ దొరుకుతున్నాయి. అంతేకాదు, మనం వేసుకునే రోజువారీ గాజుల్లో మువ్వల గాజుల్ని కలుపుకోవాలంటే బంగారు, వెండి రంగుల సన్నటి రకాలూ తయారు చేస్తున్నారు. గజ్జెల్లో చిన్నా పెద్దా సైజులూ, శబ్దం వచ్చేవీ రానివీ కూడా ఉంటున్నాయి. ఒక్క వస్తువునే నాలుగు రకాలుగా వాడే అమ్మాయిలు, ఇన్ని వెరైటీలు దొరుకుతుంటే దుమ్మురేపకుండా ఉంటారా..! ఇక, ‘నీ చేతి మువ్వలు ఘల్లుమన్నయే’.. అని పాడుకోవడమే తరువాయి!!

Bangle 1

Bangle 2

Bangle 3

Bangle 4

Bangle 5

Bangle 6
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

