తెలంగాణ సింగిడి!
ఈ నేల చరిత్రంతా చేయూత. ప్రతి పల్లెనా చేనేత. జిల్లాకో హస్తకళ! ప్రాంతానికో భౌగోళిక వైవిధ్యమే కాదు సాంస్కృతిక నేపథ్యమూ అదనపు ముచ్చట. నేలను కప్పే పచ్చని ప్రకృతిపై రంగురంగుల పూలు వికసించినట్టు.. తెలంగాణ జిల్లాలపై హస్తకళా సింగిడి విరిసింది!
ఈ నేల చరిత్రంతా చేయూత. ప్రతి పల్లెనా చేనేత. జిల్లాకో హస్తకళ! ప్రాంతానికో భౌగోళిక వైవిధ్యమే కాదు
సాంస్కృతిక నేపథ్యమూ అదనపు ముచ్చట. నేలను కప్పే పచ్చని ప్రకృతిపై రంగురంగుల పూలు వికసించినట్టు.. తెలంగాణ జిల్లాలపై హస్తకళా సింగిడి విరిసింది! ఆదివాసీ జీవనం నుంచి ఆధునిక జీవితం వరకు బతుకంతా కళా నేపథ్యమే. శతాబ్దాల సామాజిక జీవితం సంబురంలా సాగిపోయిన చరిత్రకు సాక్ష్యాలు ఈ హస్తకళలు. ఆ సంబురాన్ని తిరిగి తెచ్చిన రాజముద్రలు ఈ చిన్న జిల్లాలు.
కుమ్రం భీం అసిఫాబాద్
డోక్రా ఇత్తడి కళాఖండాలు ఆదివాసీల అంతరంగ ఆవిష్కరణలు డోక్రా కళాఖండాలు. వేల ఏండ్ల నుంచి శుద్ధిచేస్తూ, కరిగిస్తూ ఇత్తడికి కళా రూపాలనిచ్చే ఆదివాసీల కళా నైపుణ్యం భళా!
రాజన్న సిరిసిల్ల
సిరిపట్టు చీరలు, చేనేత వస్ర్తాలు చేనేత కళలో సరిలేరు మనకెవ్వరని చాటిన సిరిపట్టు ఘనత ఇది!
సిద్దిపేట – గొల్లబామ చీరలు, చేర్యాల పెయింటింగ్స్
పాలమ్మే గొల్లలకు సాలెవాళ్లు నేసిన చేనేత కానుక గొల్లబామ చీరలు.
వనపర్తి- గొంగడి
సంస్థానాల రాజస్థానంలో గ్రామీణుల రాజసం.
జనగామ
పెంబర్తి ఇత్తడి కళాఖండాలు ఓరుగల్లు శిలా సౌందర్యం ఇత్తడినీ పుత్తడిగా మార్చిన కళావైభవం!
నిర్మల్- నిర్మల్ బొమ్మలు
ప్రకృతిలోని రంగులన్నీ ఆహ్లాదపరుస్తూ మనసుకు ‘నిర్మల’మైన అనుభూతినిచ్చే అద్భుతాలివి!
యాదాద్రి భువనగిరి- పోచంపల్లి ఇక్కత్ చేనేత, తేలియా రుమాళ్లు
పడుగు పేకల అల్లికలోనే కాదు ఆసు మీద చేరిన దారానికే రూపాలద్దే చేనేత ఆవిష్కరణల వేదిక.
జోగుళాంబ గద్వాల జరీ పట్టు చీరలు, సికొ చీరలు
బంగారు మెరుపంచు.. పట్టుచీర మురిపించు!

Dokra Itthadi

Chenetha

Gadwala

Gongadi

Penbarthi Itthadi

Ikkath

Gadwala
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

