Tenali Ramakrishna | ఎదురుగా నోరూరించే మామిడిపండ్లు.. తెనాలి రామలింగడు ఏంచేశాడంటే?
ఒకపారి చెన్నాల్రామలింగం.. అదేనుల్లా, మన తెనాలి రామలింగడు బాటపొంట నడుసుకుంట కచేరికి వోతాండు. అదే తొవ్వల పొరుగు రాజ్యపు రాయబారి.. పెద్దపెద్ద పళ్లాలల్ల మంచిగ పండిన మాడిపండ్లను ఆళ్ల రాజు నజరాన వంపితే, తీసుకొని ఈళ్ల రాజు తానకు వోతాండు. అవ్విట్ని సూడంగనే.. రామలింగని నోట్ల నీళ్లు ఊరవట్టినయి.
Tenali Ramakrishna | ఒకపారి చెన్నాల్రామలింగం.. అదేనుల్లా, మన తెనాలి రామలింగడు బాటపొంట నడుసుకుంట కచేరికి వోతాండు. అదే తొవ్వల పొరుగు రాజ్యపు రాయబారి.. పెద్దపెద్ద పళ్లాలల్ల మంచిగ పండిన మాడిపండ్లను ఆళ్ల రాజు నజరాన వంపితే, తీసుకొని ఈళ్ల రాజు తానకు వోతాండు. అవ్విట్ని సూడంగనే.. రామలింగని నోట్ల నీళ్లు ఊరవట్టినయి. తిందామని అనిపియ్యవట్టె! గని.. అవి రాజు కోసమాయె! ఎంత ఆపచ్చన అనిపిచ్చినా.. తమాయించుకొని ఊకున్నడు. ఆ పండ్ల పళ్లాలను సూసుకుంట.. ఎన్కెన్కనే కచేరీలకు వోయిండు. ఆడ రాజు కొలువుదీరి గూసున్నడు. పొరుగు రాజ్యపోళ్లు దండంబెట్టి, ఆళ్ల రాజు వంపిచ్చిండని రాజు తాన పళ్లాలు వెట్టిండ్రు. అవ్విట్ని దింటె అంతా మంచే అయితదని చెప్పిండ్రు.
ప్పటిదాక తమాయించుకొని గూసున్న రామలింగడు ఇంక ఆగలేక పోయిండు. ఉరికిపోయి ఒక పెద్ద పండు తీసుకొని కొరికిండు. అది సూడంగనే ఆడున్నోళ్లందరు పరేశానైండ్రు. రాజు కోపానికచ్చి.. చెన్నాల్రామలింగాన్ని జైల్లేశి, తల్కాయ దియ్యమని ఫర్మానేశిండు. ఎంటనే భటులు రామలింగని రెండు రిక్కలు ఎన్కకు ఇరిశి వట్టుకున్నరు. గప్పుడు చెన్నాల్రామలింగం.. “అబ్బో అబ్బో! పొరుగు రాజు ఎంత ఇకమతులోడు. మన రాజును ఏదో చేద్దామన్న ఇకమతుతోనే గీ పండ్లు వంపిండు. ఒక్క పండును కొర్కుతనే నా పని గిట్లయింది. అవ్విట్ని మొత్తం దింటే.. మన రాజు గతి ఏమైతుండెనో!? అయ్యో.. అంతా బట్టెబాజ్ ఇకమతులు. ఆ పండుల మంచిలేదు.. అంతా బర్బాదే!?” అంట మొత్తుకోవట్టిండు. రామలింగని ఇకమతులు ఎరుకైన రాజు.. నవ్వాపుకోలేక పడిపడి నవ్విండు. రామలింగన్ని మాఫీ జేశిండు.
మీకు తెలుసా?
సినిమా థియేటర్లలో సాయంత్రం ఆటను ‘ఫస్ట్ షో’ అనీ, రాత్రి ఆటను ‘సెకండ్ షో’ అనీ ఎందుకు అంటారో తెలుసా? అమెరికాలో థియేటర్లు ప్రారంభమైన మొదట్లో.. రోజుకు రెండు షోలు మాత్రమే వేసేవారు. సాయంత్రం ఒక షో.. రాత్రిపూట రెండో షో. దీంతో వాటికి ఫస్ట్ షో, సెకండ్ షో అనే పేర్లు స్థిరపడ్డాయి. మార్నింగ్ షో, మ్యాట్నీ షో మొదలైనా.. ఫస్ట్ షో, సెకండ్ షో అనడం మాత్రం ఆగిపోలేదు.
పద్యం – భావం
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁదఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!
తాత్పర్యం : సమర్ధుడైన మంత్రి ఉన్నప్పుడే .. ఆ రాజ్యపు మహారాజు సామ, దాన, భేద, దండోపాయాల్లో రాణిస్తాడు. పాలన కూడా సక్రమంగా సాగుతుంది. అయితే, అలాంటి మంత్రి లేకుంటే.. పాలన అనేది కీలు ఊడిన యంత్రంలా ముందుకు సాగిపోలేదు.
చెప్పుకోండి
అరచేయంత పట్నంలో అరవై గదులు. గదికొక్క సిపాయి. సిపాయికొక్క తుపాకి?
– తేనెపట్టు
ఆమడ నడిచి అల్లుడొస్తే..
మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ దాక్కున్నారు?
– చెప్పుల జోడు, చేతికర్ర
ఎర్రని రాజ్యం. నల్లని సింహాసనం. ఒక రాజు ఎక్కితే.. ఒక రాజు దిగుతాడు?
– మిరపచెట్టు
పెద్దల మాట
విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది.
– మహాత్మా గాంధీ
టంగ్ ట్విస్టర్స్
The sixth sick sheikhs sixth sheeps sick.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

