చిలగడదుంప మెంతికూర కర్రీ.. భలే రుచిగా ఉంటుందండీ!
చిలగడదుంపలను పచ్చిగానే తినడమే కాదు కూర కూడా వండుకోవచ్చు. వీటిని ఉడికించి మెంతికూర కలిపి కూర వండితే అబ్బా భలేగా ఉంటుంది. చెబుతుంటేనే నోరూరుతుంది కదూ. దీన్ని ఎలా వండాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
చిలగడ దుంపలు: నాలుగు
మెంతికూర: ఒకటిన్నర కప్పు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి: టేబుల్ స్పూను
కారం: టీ స్పూను
పెరుగు: పెద్ద గరిటెడు
ఆమ్చూర్: అరస్పూను
జీరాపొడి, ధనియాపొడి: అరస్పూను చొప్పున
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
చిలగడ దుంపల్ని బాగా కడిగి చిన్న గుండ్రటి ముక్కలుగా తరిగి నీళ్లలో వేసుకోవాలి. మెంతికూరను కడిగి సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఒక బాణలి పెట్టి టేబుల్ స్పూను నూనె, అరస్పూను నెయ్యి వేసి కొంచెం ఉప్పు జోడించి మెంతికూరను వేయించి తీయాలి. ఇప్పుడు అదే బాణట్లో మరో స్పూను నూనె, అరస్పూను నెయ్యి వేసి తరిగి పెట్టుకున్న చిలగడ దుంపలు వేసి, కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని అందులో ధనియా పొడి, జీరా పొడి, ఆమ్చూర్, కారం, కూరకు సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాణట్లో పోసి కూరంతా సమంగా కలపాలి. అంతే…. రుచిగా ఉండే చిలగడదుంప మెంతికూర కర్రీ సిద్ధమైపోతుంది.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

