Current Meter | ఆ దీక్షను జైన మతంలో ఏమని పిలుస్తారు?
ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు?
1 ఆగ్నేయ ఆసియా దేశమైన ఇండోనేషియాలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు?

2 వాతావరణం, శీతోష్ణస్థితి, సముద్ర సంబంధ సమాచార సేకరణ కోసం భారత్ ఫిబ్రవరి 17న ఓ వాతావరణ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరేంటి? ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు?
3 ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్- 2024లో షాట్‌పుట్ పోటీల్లో స్వర్ణం సాధించిన భారత స్టార్ షాట్‌పుటర్?

4 బాలీవుడ్ సినిమా ‘దంగల్’లో ప్రముఖ రెజ్లర్ బబితా కుమారి చిన్నప్పటి పాత్రలో బాలనటిగా మెప్పించిన నటి ఇటీవల
మరణించారు. ఆమె ఎవరు?
5 భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడు ఒకరు ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం
పశ్చిమబెంగాల్ రాష్ట్ర యువజన సేవలు, క్రీడల మంత్రిగా ఉన్న ఆ క్రికెటర్ ఎవరు?

6 పర్షియన్ భాషకు చెందిన ప్రాచీన పుస్తకాల్లో ఉన్న ఒకరకం పులావ్ తయారీ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సుప్రసిద్ధ చెఫ్ ఇటీవల మరణించారు. పద్మశ్రీ అందుకున్న తొలి చెఫ్‌గా రికార్డు సాధించిన ఆ పాకశాస్త్ర నిపుణుడు ఎవరు? ఆ పులావ్ తయారీ విధానం ఏది?
7 సినీ గీత రచయిత గుల్జార్, సంస్కృత పండితుడు రామభద్రాచార్యకు కేంద్ర ప్రభుత్వం 58వ జ్ఞానపీఠ పురస్కారం ప్రకటించింది. ఆస్కార్, గ్రామీ, సాహిత్య అకాడమీ, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్‌తోపాటు, ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలు గెలుచుకున్న గుల్జార్ అసలు పేరేంటి?

8 ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్ తీర్థంలో ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ నిరాహార మార్గంలో ప్రాణత్యాగం చేశారు. ఆ దీక్షను జైన మతంలో ఏమని పిలుస్తారు?
9 పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. స్వామి నారాయణ్ సంస్థ
ఈ ఆలయాన్ని ఏ నగరంలో నిర్మించింది.

10 2024 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాదీ స్టార్టప్ నెక్ట్స్ వేవ్ సహ-వ్యవస్థాపకుడు ఎవరు?
జవాబులు
1. మాజీ సైనిక అధికారి ప్రబొవో సుబియాంటో
2. ఇన్శాట్ 3డీఎస్, జీఎస్ఎల్వీ ఎఫ్14
3. తేజిందర్‌పాల్ సింగ్ తూర్
4. సుహానీ భట్నాగర్ (19 ఏండ్లు)
5. మనోజ్ తివారి
6. ఇంతియాజ్ ఖురేషీ, పులావ్
తయారీ విధానం పేరు దమ్ పఖ్త్
7. సంపూరణ్ సింగ్ కల్రా
8. సల్లేఖన వ్రతం
9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి
10. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

