మార్కెట్లో మతిమరపు

మీ ఇంటి దగ్గరుండే సూపర్ మార్కెట్‌కి తరచూ వెళ్తూ ఉంటారు. ఏదో పని మీద వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు, అదే బ్రాండ్ సూపర్ మార్కెట్ కనిపించింది. ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టారు. కానీ ఓ అయిదు నిమిషాలు తిరిగిన తర్వాత అంతా అయోమయంగా తోస్తుంది. దారి తప్పిపోయామేమో అనిపిస్తుంది. ఇలా మనలో చాలామంది విషయంలో జరిగే ఉంటుంది. ఇందుకు ఓ స్పష్టమైన కారణం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మనలో వస్తువులను గుర్తుంచుకునే శక్తిని ‘స్పేషియల్ మెమరీ’ అంటారు. తాళం చెవులు ఎక్కడ పెట్టాం, ఇంట్లో కుర్చీలు ఎటువైపు ఉన్నాయి… లాంటి విషయాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇందాక చెప్పుకొన్న ఉదాహరణలో అలవాటైన సూపర్ మార్కెట్‌కు సంబంధించిన ‘స్పేషియల్ మెమరీ’, కొత్త చోట అడ్డుపడుతూ ఉంటుంది. సహజంగానే ప్రతి సూపర్ మార్కెట్లో వస్తువుల అమరిక వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, అయోమయానికి లోనవుతాం. దీనికోసం ఓ పరిశోధన అవసరమా అనుకోవడానికి లేదు. అల్జీమర్స్ ఉన్నవారిలో స్పేషియల్ మెమరీ లోపమే కీలకం. కాబట్టి, ఒకే తరహా సూపర్ మార్కెట్లలో నిలబడినప్పుడు… మెదడులో జరిగే చర్యలను గమనించడం ద్వారా ఇతరత్రా సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Alzheimer's disease
- brain
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

