రాచరిక వైభవం
అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో మైసూర్ ఒకటి. ఇక్కడ అమ్మవారు చాముండేశ్వరిగా పూజలు అందుకుంటున్నది. శరన్నవరాత్రుల సందర్భంగా మైసూర్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక మైసూర్ రాజప్రాసాదంలో జరిగే దసరా ఉత్సవాలు చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. మైసూర్ ప్యాలెస్లో 1610లో రాజా వడయార్ తొలిసారిగా విజయదశమి ఉత్సవాలు నిర్వహించాడట.
1805లో కృష్ణరాజ వడయార్-3 హయాంలో దసరా సందర్భంగా ప్రత్యేక దర్బార్ నిర్వహించే సంప్రదాయం మొదలైంది. రాజకుటుంబీకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారు. రాజభవనంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాలుపంచుకుంటారు. విజయదశమి నాడు జరిగే ఊరేగింపు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. రాచవీధుల్లో ఏనుగులు రాజసంతో సాగిపోతుంటాయి. అంబారీపై కొలువై ఊరేగుతూ వచ్చే అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తుంటారు.
దీనిని జంబూస్వారీ అని పిలుస్తారు. రాజభవనం దగ్గర మొదలయ్యే ఊరేగింపు బన్నిమంటప్ వరకు సుమారు నాలుగున్నర కిలోమీటర్లు కొనసాగుతుంది. ఎర్రతివాచీ స్వాగతాలు, పోలీసుల కవాతులు, కళాకారుల నృత్యాలు, వాద్యాల హోరు.. దసరా ఉత్సవాన్ని కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. దసరా సందర్భంగా ప్యాలెస్ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ వరకు కొనసాగే తిరునాళ్లలో గృహాలంకరణ వస్తువులు, కళాకృతులు, చీరలు, దుప్పట్లు.. ఇలా రకరకాల వస్తువులు దొరుకుతాయి.
ఇలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి మైసూర్కు ఫ్లైట్, రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. బెంగళూరుకు రెగ్యులర్ విమాన, రైలు సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరు నుంచి మైసూర్కు (140 కి.మీ) రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
వైతాళికుల వాణి
అబద్ధం అమితంగా ఆకర్షిస్తుంది.. తుదకు ముంచేస్తుంది!
నిజం చేదుగా ఉండవచ్చు. కానీ, నిలకడ మీద జీవితాన్ని నిలబెడుతుంది. – జిడ్డు కృష్ణమూర్తి
క్యా సీన్ హై!

Cartoon
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

