ర్యాప్ సాంగ్స్‌తో రఫ్ఫాడించగల మేజర్ మ్యాక్స్!
రాహుల్ మ్యాక్స్ స్టేజీ ఎక్కితే.. ర్యాప్ సాంగ్స్‌తో రఫ్ఫాడించగలడు. రంగస్థలం మీద అడుగుపెడితే.. నవరసాలను ఒలికించగలడు. కలం పడితే.. సామాజిక సమస్యలపై అస్ర్తాలు సంధించగలడు. తానేమిటో నిరూపించుకోవాలనే తపనతో ‘ఒక్క చాన్స్’ అంటూ అనేక ఆడిషన్లు ఇచ్చాడు. ‘మేజర్’లో ఓ మంచి క్యారెక్టర్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో.. అనేక అవమానాలు భరించాడు. ఆ ప్రయాణమంతా రాహుల్ మ్యాక్స్ మాటల్లోనే..
‘అమ్మ దుర్గావతిది మధ్యప్రదేశ్, నాన్న రవినారాయణ్ సింగ్‌ది ఉత్తరప్రదేశ్. ముప్పై ఏండ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. నా చదువు మొత్తం ఇక్కడే. పదో తరగతి తర్వాత ర్యాప్ ప్రారంభించా. ‘డివైన్’, ‘లేజీ’ వంటి ర్యాపర్స్ పాటలు వింటూ నన్ను నేను తీర్చిదిద్దుకున్నా. ఇంటర్ తర్వాత సమాజంలోని అసమానతల గురించి కవితలు, పాటలు రాయడం, పాడటం మొదలు పెట్టాను. నాకంటూ ఓ గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించాను.
నా వీడియోలు నచ్చని ఓ వర్గం బెదిరింపులకు దిగింది. చంపేస్తామని హెచ్చరించింది. దీంతో నేను చానెల్‌ను మూసేయాల్సి వచ్చింది.
నన్ను నేను నిరూపించుకోవడానికి నాటకమే సరైన వేదికని అనుకున్నాను. ఇంట్లో తెలియకుండా ‘రంగస్థలం యాక్టర్ స్టూడియో’లో చేరాను. నాన్నకేమో నన్ను సీఏ చదివించాలని కోరిక. తన జీతంలో సగానికి సగం నా చదువులకే వెచ్చించేవారు. నా నిర్ణయం విన్న తర్వాత నాన్న ఏడాదిపాటు మాట్లాడలేదు. అయినా ధైర్యంతో రవీంద్ర భారతిలో అడ్ల సతీష్కుమార్గారి దగ్గర నటనలో శిక్షణ పొందాను. ఈ క్రమంలో ‘భాగ్యనగర భాగమతి’ వంటి ఎన్నో నాటకాల్లో నన్ను నేను నిరూపించుకున్నాను. మరింత ప్రొఫెషనల్‌గా ఎదగాలనే ఉద్దేశంతో ‘శూద్రక’ అనే బెంగాల్‌కు చెందిన రంగస్థల సంస్థతో కలిసి పనిచేశాను. ఆ వేదిక ద్వారా జాతీయ రంగస్థల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు పదిహేను నాటక ప్రదర్శనలు ఇచ్చాను. అవార్డులు, రివార్డులు నాలో ఉత్సాహాన్ని పెంచాయి.
‘మేజర్’ తర్వాత లీడ్ రోల్
నాటకాలు ప్రదర్శిస్తూనే.. సినిమాలకు ఆడిషన్లు ఇచ్చాను. చాలాసార్లు తిరస్కరణలకు గురయ్యాను. అయినా ధైర్యం కోల్పోలేదు. ‘మేజర్’ సినిమాలో తొలి అవకాశం దక్కింది. ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది. ఇప్పుడు ‘ఆర్గానిక్ క్రైమ్’లో లీడ్‌రోల్ చేస్తున్నా. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో లేదా థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది.

ర్యాప్.. నా మరో కోణం
నాలోని సింగర్‌ని నేనే గుర్తించాను. ఆడిషన్లు, రంగస్థలం.. రెండు ప్రపంచాల్లో బతుకుతున్నా ఎప్పుడూ పాటను విడిచిపెట్టలేదు. 2020లో ఎండ్యురామాస్ సంస్థ నిర్వహించిన ర్యాప్ సింగింగ్ పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాను. తర్వాత ఫస్ట్కట్ సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన మోనోలాగ్ సీజన్-1 పోటీల్లో విజేతగా నిలిచాను. ‘రంగస్థలం యాక్టర్ స్టూడియో’ నిర్వహించిన మోనోలాగ్ పోటీల్లో కూడా గెలుపు నాదే. ప్రస్తుతం వరల్డ్ మోనోలాగ్ పోటీలు సిడ్నీలో జరుగుతున్నాయి. దానిలో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ గెలిస్తే.. 3వేల డాలర్ల నగదు బహుమతి వస్తుంది. నా గురించి తన స్నేహితులు గొప్పగా చెప్పడంతో.. నాన్న నన్ను పిలిచి మాట్లాడారు, మెచ్చుకున్నారు. నన్ను ప్రోత్సహిస్తున్నారు కూడా. నెట్‌ఫ్లిక్స్‌లో రోజుకు ఒకసారైనా అమ్మ నన్ను చూసుకుంటుంది. అప్పుడు ‘నీ మొహం అద్దంలో చూసుకో..’ అన్నవాళ్లే, ఇప్పుడు నా మొహాన్ని వెండితెరపై చూస్తున్నారు. తరచూ ప్రముఖ ర్యాపర్స్తో కలిసి స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. 30కిపైగా ర్యాప్ కచేరీలు చేశాను. ఇదంతా నా కష్టం వల్లే సాధ్యమైంది. నా ఆత్మవిశ్వాసమే నా విజయ రహస్యం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- MAX
- rap song singer
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

