Photo Cutout Standee | పెళ్లి రోజు అయినా.. పుట్టిన రోజు.. ఫంక్షన్ ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇదేనంట !!
Photo Cutout Standee | కటౌట్ మహేశ్బాబుకేనా, ఉమేశ్బాబుకూ ఉంటుంది. అయినా, ఆరడుగుల కటౌట్లే ఉండాలన్న రూలు లేదు, ఆరంగుళాల్లోనూ అదరగొట్టొచ్చు. మన జీవితంలోని సూపర్ స్టార్లకు వీటిని కానుకగా అందించొచ్చు. మూవీ స్టార్ కటౌట్ థియేటర్ బయట ఉంటే, జిందగీ స్టార్ బొమ్మ ఇంట్లో ఉంటుంది. అంతే తేడా! మిగతాదంతా సేమ్ టు సేమ్! ‘కటౌట్ ఫొటో స్టాండీ ( Photo Cutout Standee )’ కానుకల్లో కొత్త ట్రెండ్.

కానుక ఇవ్వాలనుకోవాలే గానీ, సందర్భాలు అనేకం. పెళ్లిరోజు, పుట్టినరోజు, వాలెంటైన్స్‌డే, ఫ్రెండ్‌షిప్‌డే, బ్రదర్స్ డే, మదర్స్‌డే.. ఇలా ఎన్నెన్నో. ఒక్కొక్క సందర్భాన్నీ ఒక్కొక్కరితో సెలబ్రేట్ చేసుకుంటాం. అనుబంధాన్ని బట్టి బహుమతులు ఇస్తుంటాం. సందర్భం ఏదైనా వేడుక మరేదైనా అందరికీ ఇవ్వగలిగేలా తయారవుతున్నదే ‘కటౌట్ ఫొటో స్టాండీ’. ఒక ఫొటో మొదలు పది ఫొటోల దాకా ఇమిడేలా ఈ ఫొటో ఫ్రేమ్‌లు రూపొందుతున్నాయి. సాధారణ ఫ్రేములకు భిన్నంగా, స్టాండ్ తరహాలో వస్తున్నాయి. వేడుకను బట్టి హ్యాపీ యానివర్సరీ అనో, హ్యాపీ బర్త్‌డే అనో అక్షరాలనూ జోడించొచ్చు. అమ్మా నాన్నలు, అక్కాతమ్ముళ్లకు ఇవ్వాలంటే బెస్ట్ బ్రదర్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ పేరెంట్స్లాంటి పదాలూ చేరుస్తున్నారు. ఇందులో రకరకాల డిజైన్లు దొరుకుతున్నాయి.

పూర్తి కస్టమైజబుల్ కాబట్టి నచ్చిన ఫ్రేమ్‌ను ఎంచుకుని, కావలసినన్ని ఫొటోలను తయారీ సంస్థలకు పంపించాలి. సందేశం జోడించాలనుకుంటే.. అదీ తెలియజేయవచ్చు. చెక్క బేస్‌తో గ్లాసీ ఫినిష్‌తో కటౌట్ తరహా ఫొటోను జోడించి వీటిని రూపొందిస్తారు. గిఫ్ట్ ప్యాక్ చేసి చెప్పిన అడ్రస్‌కు పంపుతారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ వీటిని తయారుచేస్తున్నారు. ఆరేడు అంగుళాలు మొదలు ఇరవై ముప్పై ఇంచుల దాకా ఇవి తయారవుతున్నాయి. ధర ఐదొందల నుంచీ ప్రారంభం. ఇంకేం, ఈసారి ఎవరికి కానుక ఇవ్వాలనుకున్నారో వారి మధురక్షణాల చిత్రాలను సేకరించి పెట్టుకుని, వాటిని ఫొటోస్టాండీగా మార్చేయండి. అందుకున్న వారి మొహంలో నవ్వును విరబూయించడమే కాదు, గదికి అందాన్నీ తీసుకుని వస్తుంది!

Read More :
అమెరికాలో డాలర్లు వద్దని.. హైదరాబాద్ వచ్చి పాల వ్యాపారం చేస్తున్నడు”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

