Personal Finance | ఆఫీస్ వాళ్లు రూ.5 లక్షల కవరేజీ ఇచ్చాక.. మరో బీమా తీసుకోవడం దేనికి?
అలవాటులో పొరపాటు మానవ సహజం. కానీ, చిన్న పొరపాటు జీవితాన్ని తలకిందులు చేసే ప్రమాదం ఉంది. ఆరోగ్య బీమా విషయంలో సగటు ఉద్యోగి ప్రదర్శించే నిర్లిప్త ధోరణి.. అతని జీవితాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. పదిలంగా నిర్మించుకున్న ఆర్థిక పునాదులు కదిలిపోతాయి.
అలవాటులో పొరపాటు మానవ సహజం. కానీ, చిన్న పొరపాటు జీవితాన్ని తలకిందులు చేసే ప్రమాదం ఉంది. ఆరోగ్య బీమా విషయంలో సగటు ఉద్యోగి ప్రదర్శించే నిర్లిప్త ధోరణి.. అతని జీవితాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. పదిలంగా నిర్మించుకున్న ఆర్థిక పునాదులు కదిలిపోతాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు? ఆఫీస్ వాళ్లు ఐదు లక్షల రూపాయల కవరేజీ ఇచ్చాక మరో బీమా తీసుకోవడం దేనికి? అని తర్కిస్తే… చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది.
Personal Finance | కల్తీలతో పల్టీలు కొడుతున్న నేటి మనిషి ఆరోగ్యం మేడిపండు చందమే! తాగుతున్న పాలు, తింటున్న ఆహారం అన్నీ రసాయన అవశేషాలతో అందుతున్నాయి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. ఊహించని రోగాలు మనిషిని పలకరిస్తూనే ఉన్నాయి. పేర్లు తెలియని రోగాలు, నోరు తిరగని పేర్లున్న జబ్బులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఒకవేళ ఆరోగ్యం బాగున్నా.. ఉరుకుల పరుగుల జీవితాల్లో ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయని మర్చిపోవద్దు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడే శక్తినిచ్చే ఏకైక అస్త్రం హెల్త్ ఇన్సూరెన్స్. ఆరోగ్య బీమా ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ప్రధానం.
మూడింతల భారం
నాలుగైదు లక్షల రూపాయలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని గుండెల మీద చేయి వేసుకొని తృప్తిగా పడుకునే రోజులను ఎప్పుడో దాటొచ్చేశాం. ఒకప్పుడు మోకాలు చిప్ప మార్పిడికి రూ.70 వేల వరకు అయ్యేది. ఇప్పుడది రూ.3 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేండ్లకు ఒకసారి దవాఖాన ఖర్చులు మూడింతలు పెరుగుతున్నాయి. కంపెనీ వాళ్లు ఇచ్చే రూ.5 లక్షల ఇన్సురెన్స్ చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు సరిపోతుందేమో! కానీ, తీవ్ర జబ్బులు తలెత్తినప్పుడు ఈ మొత్తం ఏ మూలకూ రాదు. పైగా ఉద్యోగంలో ఉన్నంత వరకే కంపెనీలు ఇచ్చే పాలసీలు వర్తిస్తాయి. ఇరవై ఏండ్లు ఉద్యోగం చేసి యాభయ్యో పడిలో పడ్డాక బయటికి వస్తే… అప్పుడు పరిస్థితి ఏంటి?
నో గ్యారెంటీ..
ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్యక్తిగతంగా కుటుంబసభ్యుల పేరిట ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యావశ్యకం. ‘కీడెంచి మేలెంచాలి’ అన్న సూత్రం ఆరోగ్యం విషయంలో ఆలోచించడానికి కూడా మనిషి అంగీకరించడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.యాభై లక్షలు, రూ.కోటి బీమా తీసుకోమని సూచించగానే, ‘అంత ప్రీమియం కట్టలేను’ అనేస్తాడు. అయితే, ప్రీమియం మొత్తం కట్టలేని వ్యక్తి.. ఆస్పత్రి పాలైనప్పుడు బిల్లు ఎలా కడతాడో మాత్రం ఆలోచించడు. పైగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జబ్బులు వస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ లేనంత కాలం మీ స్థిరచరాస్తులకూ, బంగారానికీ గ్యారెంటీ లేదని గుర్తుంచుకోండి.
ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.యాభై లక్షలు, రూ.కోటి బీమా తీసుకోమని సూచించగానే, ‘అంత ప్రీమియం కట్టలేను’ అనేస్తాడు. అయితే, ప్రీమియం మొత్తం కట్టలేని వ్యక్తి.. ఆస్పత్రి పాలైనప్పుడు బిల్లు ఎలా కడతాడో మాత్రం ఆలోచించడు.
అంతులేని విశ్వాసం
ఆరోగ్యబీమా ఉంటే ఎంతటి భరోసా ఉంటుందో మల్లికార్జున రావు కథ చదివితే తెలుస్తుంది. ఆయన ఓ కార్పొరేట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. బాగా చదువుకుంటున్నారు. ఏ చింతా లేకుండా భార్యాపిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. తను పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ వెసులుబాటు ఉన్నప్పటికీ రెండేండ్ల కిందట వ్యక్తిగత రూ.50 లక్షల విలువైన ఆరోగ్య బీమా తీసుకున్నాడు. మరుసటి ఏడాది ఒంట్లో నలతగా ఉంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలింది. ఇమ్యూనిటీ థెరపీకి సిద్ధమయ్యాడు. ఒక్కో సిట్టింగ్‌కు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు అయింది. ఇప్పటివరకు దాదాపు రూ.35 లక్షలు వైద్యానికి వెచ్చించాడు. ముందుచూపుతో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఆయన ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యేది. వైద్యానికి అయిన ప్రతి రూపాయి క్లెయిమ్ చేయడంతో.. ఆయన సంపద నయాపైసా కరిగిపోలేదు. ఆర్థికంగా ఏ ముప్పూ లేదన్న విశ్వాసం ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది.
ఎవరన్నది కాదు..
హెల్త్ ఇన్సూరెన్స్… ఏ సంస్థ నుంచి తీసుకున్నామన్నది ప్రాధాన్యం కాదు. ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం. ఈ రోజుల్లో దాదాపు అన్ని బీమా సంస్థలు మెరుగైన క్లెయిమ్ రికార్డును కలిగి ఉన్నాయి. మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. రూ.10 లక్షల పాలసీకి, రూ.కోటి విలువైన పాలసీకి ప్రీమియంలో వ్యత్యాసం ఏడాదికి రూ.15వేల వరకు మాత్రమే ఉంటుంది. ఆ మొత్తానికే జంకితే.. జరగరానిది జరిగినప్పుడు మీరే కాదు.. మీ కుటుంబమూ రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ తరుణంలో.. ఉద్యోగం ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఒక కొలువు పోయి.. మరో కొలువు చూసుకునేలోపు ఏదైనా అనారోగ్యం తలెత్తితే, ప్రమాదం జరిగితే… పరిస్థితి ఏంటి? ఇలాంటి దుస్థితి మీకు రావొద్దంటే.. రూ.కోటికి తక్కువ కాకుండా మీకు, మీ కుటుంబానికి వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకోవడం ఒక్కటే పరిష్కారం!
ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

