దోస్తానా
ఒక చెరువు కాడ ఒక తాబేలు ఉంటుండె. ఆన్నే ఉండే నక్క.. గీ తాబేలుకు దోస్తు. ఇద్దరూ కల్శి మెల్శి తిరిగెటోళ్లు. కలిశే ఆడుకునేటోళ్లు. ఒకపారి రెండు ఆడుకుంటుండంగా.. మెల్లమెల్లగా ఒక చిరుతపులి ఆడికచ్చింది.
ఒక చెరువు కాడ ఒక తాబేలు ఉంటుండె. ఆన్నే ఉండే నక్క.. గీ తాబేలుకు దోస్తు. ఇద్దరూ కల్శి మెల్శి తిరిగెటోళ్లు. కలిశే ఆడుకునేటోళ్లు. ఒకపారి రెండు ఆడుకుంటుండంగా.. మెల్లమెల్లగా ఒక చిరుతపులి ఆడికచ్చింది. దాన్ని సూడంగానే నక్క లంకెవెట్టి ఆడికెల్లి పారిపేయింది. తాబేలు మెల్లమెల్లగ నడుత్తదాయె! దాంతోని చిరుతపులచ్చి.. ఆ తాబేలును దొర్కవట్టింది. ఆయింత ఆంబుక్క వెడుదామని.. నోట్లె వెట్టుకున్నది. అయితె.. తాబేలుకు డిప్ప ఉండుట్ల చిరుతపులికి దంగలే. ఆన్నే శెట్టు కింద కూసొని.. పంజాతోని గొట్టి జూశింది.
ఆ డిప్ప పలుగలే. మల్ల నోట్లె వెట్టుకొని మెల్లమెల్లగ కోరలతోని కొరికి సూశింది. ఉహూ! ఎంతట్లకు దంగలే! చిరుతపులి పరేశాన్ జూశిన నక్క.. ఎట్లనన్న తన దోస్తును కాపాడాల్నని అనుకున్నది. దూరం నుంచే.. “ఆ తాబేలు డిప్ప ఎట్ల పలగొట్టాల్నో.. నాకు ఎరికే!” అన్నది. “ఎట్ల!?” అని అడిగింది చిరుత. “ఏం లేదు.. దాన్ని నీళ్లల్ల పారెయ్యి! కొంచెం శేపటికి మంచిగ నానుతది. మెత్తగైతది. అటెన్క ఒక్క దెబ్బకే పలుగుతది!” అంట జెప్పింది. తెలివిదక్వ చిరుతపులి.. నక్క మాటలు నిజమేనని నమ్మింది. తాబేలును నీళ్లల్లకు ఇశిరేశింది. దొరికిందే లెక్క అనుకొని.. తాబేలు నీళ్లల్ల మునిగి, చిరుతపులికి దొర్కకుంట వోయింది.
పెద్దల మాట
మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి. ఎందుకంటే, మీరు రెండోసారి విఫలమైతే.. మీ మొదటి విజయం కేవలం అదృష్టమే అని హేళన చేయడానికి ఎన్నో పెదవులు వేచి చూస్తుంటాయి.
– ఏపీజే అబ్దుల్ కలాం
మీకు తెలుసా?
బుల్లి ఎలుగుబంటిలా కనిపించే ‘కోలా’ అనే జంతువును చూసే ఉంటారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే ఈ జీవి వేలిముద్రలు.. మనుషుల వేలిముద్రలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఎంతలా అంటే.. నేర పరిశోధనల్లో కోలా జంతువుల వేలి ముద్రలను కూడా మనుషుల వేలి ముద్రలే అని పోలీసుల పొరబడేంతగా!
చెప్పుకోండి
- ఏరు మీద మిరపచెట్టు. నాకు కనిపిస్తుంది కానీ, నీకు కనిపించదు?
– బొట్టు
- వెలుతురు ఉన్నపుడే దర్శనమిస్తాను. చీకటి పడితే.. కనుమరుగవుతాను?
– నీడ
- ఆకుల్లేని అడవిలో జీవంలేని జంతువు. జీవం ఉన్న ప్రాణులను వేటాడుతుంది?
– దువ్వెన
పద్యం – భావం
పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబులారు దైవంబు ఒక్కటె విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం : పశువులు వేరువేరు రంగులలో ఉన్న ప్పటికీ.. అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. పువ్వులు వేరువేరు రంగులతో ఉన్నా.. పూజకు వినియోగ పడటంలో అవన్నీ ఒక్కటే! అలాగే, వర్ణాల వేరైనా..
మనుషులంతా ఒక్కటే.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

