ఇన్‌స్టాలో..మాన్స్టర్స్కు చిక్కొద్దంటే!
ఇప్పుడు ప్రపంచమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమిడిపోయింది. అభిరుచులను పంచుకోడానికి, కాలక్షేపానికి, కలల సాకారానికి అన్నిటికీ ఇన్‌స్టాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమంలో సుమారు 270 కోట్ల ఖాతాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇప్పుడు ప్రపంచమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమిడిపోయింది. అభిరుచులను పంచుకోడానికి, కాలక్షేపానికి, కలల సాకారానికి అన్నిటికీ ఇన్‌స్టాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమంలో సుమారు 270 కోట్ల ఖాతాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీటిలో అన్ని ఖాతాలూ నికార్సైనవే అనుకుంటే పొరపాటు. ఇక్కడ కాపుకాసిన సైబర్ మాన్స్టర్స్.. మిగతా యూజర్ల బలహీనతనే తమ బలంగా వాడుకుంటారు. అదును చూసి పదునైన అస్ర్తాన్ని సంధించి వంచిస్తారు. ఫ్రాడ్స్టర్లు ఎలాంటి వల పన్నుతారో తెలిస్తే గానీ
ఇన్‌స్టా స్టార్ అనిపించుకోలేరు!
యంగ్ తరంగ్‌లు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా ఇన్స్టాగ్రామ్ మారిపోయింది. కొందరు పోస్టులతో సత్తా చాటుతుంటే.. మరికొందరు రీల్స్‌తో ఇన్‌స్టాను రూల్ చేస్తున్నారు. పదిమంది మెచ్చుకోలు కోసం చేసే ప్రయత్నాల్లో అనుకోకుండా సైబర్ మోసగాళ్ల బారినపడుతున్నారు.
ఆకతాయిల ప్రతిస్పందనలకు అతిగా మురిసిపోయే అతివలు కొందరైతే, మగువల చిత్తరువులకు చిత్తయిపోయే మగవాళ్లు మరికొందరు. మిమ్మల్ని ఏమార్చి పాస్వర్డ్ కొల్లగొట్టి.. మీ అకౌంట్‌ను తమదిగా వాడుకునే వాళ్లూ ఉంటారు. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడతారు. మాల్వేర్తో ఫోన్లో చొరబడతారు. ఇలా రకరకాల మోసాలతో ఇన్‌స్టా యూజర్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ఫిషింగ్ స్కామ్స్: తెలివైన ఎత్తుగడతో యూజర్లను బోల్తా కొట్టించడం ఫ్రాడ్స్టర్లకు చాలా తేలికైన పని. ఎంపిక చేసుకున్న యూజర్‌కు ఇ- మెయిల్ ద్వారా గానీ, సంక్షిప్త సందేశం రూపంలో గానీ లింక్ షేర్ చేస్తారు. దాన్ని ఓపెన్ చేశామా.. మన ఇన్‌స్టా పేజీపై వాళ్లకు యాక్సెస్ లభిస్తుంది. ఒకసారి లాగిన్ వివరాలు చేతికి అందితే ఇంకేముంది.. దర్జాగా మన ఖాతాలోకి ప్రవేశించి పర్సనల్ డాటాను కొల్లగొడతారు. కొన్నిసార్లు యూజర్ చేసిన పోస్టుపై కాపీరైట్ ఇష్యూను లేవనెత్తుతారు.
ఇదేదో కొంపమునిగేలా ఉందని స్పందిస్తే.. ఇబ్బందులకు గురిచేస్తారు. కొన్నిసార్లు ఫేక్ ప్రకటనలతో ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తారు. ఇన్‌స్టా అకౌంట్‌కు బ్లూటిక్ ఇస్తామని కేవైసీ ప్రక్రియ పూర్తి చేయమంటారు. ఇలా వారు వేసే ప్రతి ఎత్తుగడకూ ఓ లింక్ జతచేసి సందేశం పంపుతారు. ఆ సందేశాన్ని సందేహించకుండా లింక్ క్లిక్ చేస్తే మీ సంతోషం ఆవిరవ్వడం ఖాయం.
రొమాన్స్ స్కామ్: ఫేక్ అకౌంట్‌తో ప్రేమ వ్యవహారం నడిపించి మోసం చేయడం ఇటీవల కామన్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ తరహా వ్యవహారాలకు అవకాశం ఉంది. ఏ పోస్ట్ పెట్టినా, ఏ రీల్ పెట్టినా లైక్ చేసి, కామెంట్ పెట్టి దగ్గరవుతారు. రెగ్యులర్‌గా చాట్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటారు. చిన్నది చిక్కిందని నమ్మకం కుదిరిన తర్వాత కాసులవేటకు దిగుతారు. వీసా ప్రాసెస్ ఫీజ్ కావాలనీ, హాస్పిటల్ బిల్ కట్టాలని ఇలా రకరకాల మాయమాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తారు.
గివ్అవే: ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్లు ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఊరించే ఆఫర్లతో ఊదరగొడతారు. ‘స్పిన్ చేయండి.. విలువైన కానుకలు గెలుచుకోండి’ అనే పోస్టులు పెడతారు. స్పిన్ చేసి, తీరా ఆకర్షణీయమైన బహుమతి గెలుచుకున్న తర్వాత.. ఈ పోస్ట్‌ను పది
మందికి షేర్ చేయమని మరో సందేశం వస్తుంది. అప్పనంగా బహుమతి వస్తుంది కదా! అని, దానిని
మనవారికే ఫార్వర్డ్ చేసేస్తాం. కానీ, సదరు లింక్ ఓపెన్ చేయగానే మన సమాచారం వారి హస్తగతమయ్యే ప్రమాదం ఉంది.
పెట్టుబడి ఉచ్చు: చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలంటూ ప్రచారం చేస్తారు. ప్రాజెక్టులు అప్పగించి చేయమని చెబుతారు. దానికి సంబంధించిన యాప్ లింక్ పంపుతారు. ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం యాప్ అకౌంట్లో రెట్టింపు అయినట్టుగా కనిపిస్తుంది. కానీ, వాటిని వెనక్కి తీసుకోవడం మాత్రం వీలుపడదు. ఇలా యూజర్లను బోల్తా కొట్టిస్తారు.
ఇలా స్పాట్ పెట్టండి..
- మీకు పరిచయం లేని వ్యక్తులు, అన్‌వెరిఫైడ్ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించకపోవడం మేలు.
- ఒక అకౌంట్ హోల్డర్ ఫాలో అవుతున్న వారి సంఖ్య వేలల్లో ఉండి, ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య పదుల్లో ఉంటే… అది స్కామర్ ఖాతాగా అనుమానించొచ్చు.
- చిన్నచిన్న వాటికి కూడా అతిగా రెస్పాండ్ అవుతున్నారంటే అనుమానించాల్సిందే! సదరు ఖాతా ప్రారంభించి ఎన్ని రోజులైందో గమనించాలి. ఫ్రాడ్స్టర్లు ఎప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరుస్తుంటారు కాబట్టి, రీసెంట్గా క్రియేట్ చేసినవైతే… దూరం పెట్టడం మంచిది.
- ఇన్‌స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారు డబ్బులు అడిగారంటే.. వాళ్లు ఫేక్ అని
ఫిక్సయిపోండి. మీ అకౌంట్ సేఫ్ - టూ-ఫ్యాక్టర్ (2FA) ఆథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలి.
- కఠినమైన పాస్వర్డ్ ఉండేలా జాగ్రత్తపడండి.
- ఏవైనా వస్తువులు, దుస్తులు ఇన్‌స్టాలో వచ్చే యాడ్స్ నుంచి కాకుండా, అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయండి.
- మీ లాగిన్ యాక్టివిటీ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మీరు లాగిన్ కాని సమయంలో అకౌంట్ యాక్టివ్‌గా ఉందని అనుమానం వస్తే.. పాస్వర్డ్ మార్చాలని గుర్తుంచుకోండి. వెరిఫై చేయని థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించకండి.
- https://help.instagram.com/116024195217477 లింక్ ద్వారా మీ ప్రైవసీ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవచ్చు.
- https://help.instagram.com/192435014247952 లింక్ ఉపయోగించి రిపోర్ట్ చేయొచ్చు.
- https://help.instagram.com/165828726894770 లింక్‌తో స్పామ్, అబ్యూస్పై రిపోర్ట్ చేయొచ్చు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

