ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతుందని చాలామంది స్మార్ట్ వాచ్‌లను వాడుతున్నారు. అయితే, మాటిమాటికీ దాని స్క్రీన్‌పై కన్నేయడం వల్ల.. స్క్రీన్టైమ్ పెరిగిపోతున్నది. నోటిఫికేషన్ అలర్ట్స్, మెసేజ్‌లు.. అన్నీ స్మార్ట్ వాచ్లోకే వచ్చేస్తుంటాయి. దాంతో, ఆరోగ్యాన్ని మానిటర్ చేయాల్సిన అసలు పని పక్కన పడుతున్నది. ఈ సమస్యకు పోలార్ సంస్థ తీసుకొచ్చిన Polar Loop Gen 2 చక్కని పరిష్కారం చూపుతుంది. ఇందులో ఎలాంటి స్క్రీన్ ఉండదు. ఎలాటి అలర్ట్స్ రావు. మీ రోజువారీ యాక్టివిటీ, ఆరోగ్యాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. ఇందులోని పవర్ఫుల్ సెన్సర్లు మీ వర్కవుట్స్, హార్ట్ రేట్, ఇతర యాక్టివిటీలను చాలా కచ్చితంగా ట్రాక్ చేస్తాయి. ‘పోలార్ ఫ్లో యాప్’ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. మీ ఆరోగ్యం, యాక్టివిటీ సంబంధించిన డేటాను అక్కడే చూసుకోవచ్చు. వాటర్ రెసిస్టెన్స్ వల్ల ఈత కొట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. దీని బరువు కేవలం 29 గ్రాములు మాత్రమే! కాబట్టి, చేతికి ఎంతసేపు పెట్టుకున్నా.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంటికి గట్టి భద్రత

శివారు ప్రాంతాల్లో ఇంటి భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. మామూలు తాళాలే కాదు.. ఒక్కోసారి స్మార్ట్ తాళాలు కూడా పనికి రాకుండా పోయే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భాల్లో Ultraloq Bolt SE ఉంటే.. ఇంటి భద్రత నాలుగింతలు పెరుగుతుంది. ఇదో మల్టిపుల్ అన్లాకింగ్ డివైజ్. కేవలం ఒక్క పద్ధతికే పరిమితం కాకుండా.. నాలుగు రకాలుగా దీన్ని అన్‌లాక్ చేయొచ్చు. ఈ పరికరం సంప్రదాయ మెకానికల్ కీతోపాటు ఫింగర్ ప్రింట్, పాస్ కోడ్, స్మార్ట్‌ఫోన్ యాప్‌తోనూ లాక్/ అన్‌లాక్ అవుతుంది. రిమోట్ యాక్సెస్ ద్వారా.. ఇంట్లో లేకపోయినా, స్మార్ట్ హోమ్ హబ్, వైఫై బ్రిడ్జ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా అన్‌లాక్ చేయవచ్చు. ఇది ఆపిల్ హోమ్ కిట్, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్స్తో సమర్థంగా పనిచేస్తుంది. అత్యంత దృఢమైన లోహంతో తయారైంది. కాబట్టి దీనిని విరగ్గొట్టడం దాదాపు అసాధ్యం.
పవర్ఫుల్ క్లీనింగ్

ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే.. వాటి వెంట్రుకలతో ఎప్పుడూ ఇబ్బందే! అవి తిరిగిన చోటల్లా పడుతూ చికాకు తెప్పిస్తుంటాయి. మామూలు వాక్యూమ్ క్లీనర్లతో వాటిని తొలగించడం కష్టమే! అందుకే, ప్రముఖ డైసన్ సంస్థ Dyson V16 Piston Animalవాక్యూమ్ క్లీనర్‌ను తీసుకొచ్చింది. డైసన్ బ్రాండ్ నుంచి వచ్చిన సమర్థమైన, అధునాతన కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్లలో ఇదీ ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన 900వాట్స్ మోటార్‌తో పనిచేస్తుంది. కార్పెట్లు, ఫ్లోర్లపై ఉండే సన్నటి ధూళిని కూడా పూర్తిగా లాగేస్తుంది. ఆటో అడాప్టివ్ టెక్నాలజీ వల్ల.. మీ ఫ్లోర్ రకాన్ని (కార్పెట్/ హార్డ్ ఫ్లోర్) బట్టి.. ఆటోమేటిక్‌గా తన సక్షన్ పవర్, బ్రష్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. సాధారణ కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ ధూళిని కూడా స్పష్టంగా చూపించడానికి దీని హెడ్లో గ్రీన్ లేజర్ లైట్ టెక్నాలజీని ఏర్పాటుచేశారు. దీన్ని ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 70 నిమిషాల పాటు వాడుకోవచ్చు. అవసరమైతే బ్యాటరీని సులభంగా మార్చుకోవచ్చు.
చిటికెలో చిరుతిండి

ఓ పక్క ఆరోగ్యంపై శ్రద్ధ.. మరోపక్క నూడుల్స్, పాస్తా లాంటివి తినాలనే కోరిక. Pigeon Instamami Automatic Noodle Makerఇంట్లో ఉంటే.. రెండూ నెరవేరుతాయి. ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరమైన నూడుల్స్, పాస్తా లాంటివి క్షణాల్లో తయారు చేసి పెడుతుంది. సరైన మోతాదులో పిండి, నీళ్లు వేసేస్తే.. పిండిని కలపడం నుంచి నూడుల్స్ బయటికి రావడం వరకు అంతా ఈ పరికరమే చూసుకుంటుంది. 15 నిమిషాల్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని ఫ్రెష్ నూడుల్స్‌ను సిద్ధం చేసి పెడుతుంది. ఈ నూడుల్ మేకర్తోపాటు ఆరు రకాల డైసెస్ వస్తాయి. వాటి సహాయంతో రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. పని పూర్తికాగానే.. ఇందులోని విడిభాగాలను సులభంగా విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో 1200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కరెంట్ పోయినా, ఆరుబయటైనా వాడుకోవచ్చు.